• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాక్ష్యంలో కీ పాయింట్...

సాక్ష్యంలో కీ పాయింట్ అదేనట!

By - Tupaki Desk
Update: 2018-07-25 07:05 GMT
ఎల్లుండి విడుదల కాబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సాక్ష్యం ఓపెనింగ్స్ హీరోని బట్టి కంటే అందులో ఉన్న సబ్జెక్ట్ ని బట్టి వచ్చేలా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఫాంటసీ నేపధ్యంలో సినిమాలు రాలేదు కాబట్టి ప్రేక్షకులు కూడా దీని మీద ఆసక్తిగానే ఉన్నారు. భారీ బడ్జెట్ తో రూపొందిన సాక్ష్యంలో గ్రాఫిక్స్ కు పెద్ద పీఠ వేశారు. ఇక ఇందులో కథగా చెబుతున్న కీ  పాయింట్ లీక్ రూపంలో ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం సాక్ష్యం గోమాత కాన్సెప్ట్ చుట్టూ ఉంటుందట. తనకు జరిగిన అన్యాయానికి బదులుగా లోక వినాశనం జరగకుండా ఒక ఆవు ఎక్కడో విదేశాల్లో ఉన్న హీరోను ఇక్కడకు రప్పించేలా చేసి అతని ద్వారా ఐదుగురు లోక నాశకులను చంపించడమే సాక్ష్యం కథగా దాని సారాంశం. ఆ క్రమంలో పంచ భూతాల్లో ఒక్కొక్కటి ఒక్కో విలన్ ని చంపేటప్పుడు సాయంగా వస్తాయట. ఆవు హీరోనే ఎందుకు రప్పిస్తుంది అతనికి ఆ విలన్లకు ఉన్న లింక్ ఏంటి అనేది ఫ్లాష్ బ్యాక్ లో చూపించేస్తారు. ఆ విలన్లను చంపే ప్రతి ఎపిసోడ్ ను ఉద్వేగభరితంగా సీజే వర్క్ తో ఓ రేంజ్ లో తీసారని టాక్.

ఇది నిజమో కాదో కానీ ట్రైలర్ తో మాత్రం మ్యాచ్ అవుతోంది. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కు ఇది హిట్ కావడం చాలా అవసరం. పైగా 40 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొంది అంతే స్థాయిలో బిజినెస్ కూడా జరుపుకుంది. ఓపెనింగ్స్ మాత్రమే కాదు ఓ రెండు వారాల పాటు స్ట్రాంగ్ రన్ దొరికితే సేఫ్ అవుతుంది. పూజా హెగ్డే గ్లామర్ ప్లస్ పాయింట్ గా నిలుస్తుండగా హర్షవర్షన్ రామేశ్వర్ సంగీత ఇప్పటికే మంచి టాక్ తెచ్చుకుంది. పూజా హెగ్డే  డీజేలో హీరోయిన్ గా రంగస్థలంలో ఐటెం సాంగ్ చేసాక కనిపించే సినిమా ఇదే. జగపతి బాబు మెయిన్ విలన్ గా నటిస్తున్న ఈ మూవీని అభిషేక్ పిక్చర్స్ సంస్థ మొదటిసారి చాలా  భారీ బడ్జెట్ తో తీసింది. త్రిష మోహిని-నీహారిక హ్యాపీ వెడ్డింగ్ పోటీలో ఉన్నా అవి డిఫరెంట్ జానర్ కావడంతో పాటు స్టార్ హీరోలు లేని సినిమాలు కాబట్టి సాక్ష్యంకి ఫస్ట్ డే వచ్చిన ఇబ్బంది లేదు. టాక్ కనక నిలబెట్టుకుంటే సాయి శ్రీనివాస్ కు మొదటి బ్రేక్ వచ్చేస్తుంది.
Tags:    
  • Bellamkonda Srinivas 
  • Sakshyam Movie 
  • Telugu NEWs 

Similar News

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

2026-11-13 04:09 GMT

సినిమా నిర్మాత‌కు, ఫైనాన్షియ‌ర్‌కు మ‌ధ్య ఉండే ప్ర‌ధాన‌మైన తేడా?

2026-11-13 04:08 GMT

Bigg Boss Telugu 10: దేబ్జానీకి, సుధీర్ కి అదిరిపోయే హింట్స్!

2026-11-13 04:06 GMT

'పుష్ప 2' రికార్డును బ్రేక్ చేయ‌లేక‌పోయిన రామాయ‌ణం-1

2026-11-13 02:45 GMT

హైద‌రాబాద్‌లో సోఫాలు అమ్మి.. ముంబైలో 16 కోట్ల ఇల్లు కొన్న హీరో!

2026-11-13 00:30 GMT

'వార‌ణాసి' త‌ర్వాత 'మ‌హాభార‌తం'పైనే రాజ‌మౌళి ఫోక‌స్?

2026-11-12 23:30 GMT

సీరియ‌ల్ కిస్స‌ర్‌తో జెనీలియా.. ఇదేనా మీ డౌట్?

2026-11-12 22:30 GMT

'ఇట్లు అర్జున' మూవీ రివ్యూ

2026-11-12 20:30 GMT

10 వేల అప్పుతో నేడు న‌టి వందల కోట్ల సామ్రాజ్యం!

2026-11-12 19:30 GMT

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

2026-11-12 18:32 GMT

క్యాన్సర్‌ను జయించిన బిగ్‌బాస్ బ్యూటీ.. సర్జరీ తర్వాత ఎమోషనల్ పోస్ట్!

2026-11-12 18:31 GMT

భార‌త్ లో పెళ్లి ఐడియా ఇచ్చింది హ‌బ్బీనా!

2026-11-12 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS