అదంతే బ్రదర్ .. న్యాయానికి రోజుల్లేవ్
పవన్ కల్యాణ్ ఒకవైపున రాజకీయాలను చక్కబెడుతూనే, మరో వైపున సినిమాలు చేస్తూ వెళుతున్నారు. రాజకీయాలలోకి వెళ్లిన పవన్ సినిమాలకి కొంత గ్యాప్ ఇచ్చారు. ఆ తరువాత ఆయన 'వకీల్ సాబ్' సినిమాను ఒప్పుకున్నారు. స్టార్ డైరెక్టర్ కాదు .. పైగా ఇది రీమేక్. అందువలన పవన్ తన రీ ఎంట్రీ ఈ సినిమాతో ఇవ్వడం కరెక్టు కాదనే అభిప్రాయాలు బలంగా వినిపించాయి.
కానీ విడుదలైన తరువాత ఈ సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోయింది. కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలించకపోయినా లాభాల బాటలో సాగిపోయింది. పవన్ క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదనే విషయాన్ని ఈ సినిమా నిరూపించింది.
ఇక ఆ తరువాత సినిమాగా ఆయన చేసిన 'భీమ్లా నాయక్' కూడా ఓ మాదిరి బడ్జెట్ తో కూడినదే. ఇది కూడా 'వకీల్ సాబ్' మాదిరిగా రీమేక్ నే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ అంతకంతకూ అంచనాలు పెంచుతూ వెళ్లాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు.
అయితే ఈ సినిమాకి ముందు 'ఆర్ ఆర్ ఆర్' వచ్చి కూర్చుంది. ఆ తరువాత రెండు రోజులకే 'రాధేశ్యామ్' రంగంలో ఉంది. ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు .. ఒకే రోజున వివిధ భాషల్లో విడుదలవుతున్న సినిమాలు.
అందువలన ఈ రెండు సినిమాల నిర్మాతలు కలిసి .. 'భీమ్లా నాయక్' ను వాయిదా వేసుకోవలసిందిగా పవన్ తో పాటు, సూర్యదేవర నాగవంశీని కోరారు. 'భీమ్లా నాయక్' బరిలో ఉంటే థియేటర్స్ పరంగా ఇబ్బంది అవుతుందని రిక్వెస్ట్ చేశారు. దాంతో సంక్రాంతి బరి నుంచి తప్పుకోవడానికి పవన్ అంగీకరించారు.
తన సినిమాను ఆయన ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేసుకున్నారు. దాంతో పెద్ద నిర్మాతలంతా కలిసి తమ హీరో సినిమా విడుదలను వాయిదా వేశారనే అసహనాన్ని పవన్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఒక నెటిజన్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ బండ్ల గణేశ్ తో "మేము అర్థం చేసుకుంటాము .. కానీ పవన్ కల్యాణ్ సినిమాకి సమస్యలు వస్తే ఈ నిర్మాతలు వస్తారా? బండ్లన్నా నువ్వైనా మా తరఫున అడగొచ్చుగా?" అంటూ దిల్ రాజు .. డీవీవీ దానయ్యతో పాటు మిగతా ప్రొడక్షన్ హౌస్ లను ట్యాగ్ చేశాడు.
అందుకు బండ్ల గణేశ్ ప్రతిస్పందిస్తూ .. "న్యాయానికి .. ధర్మానికి రోజులు లేవు బ్రదర్' అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు. మనమేం చేయలేము అనే నిస్సహాయతను వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.