స్పీడ్ పెంచిన బాలయ్య.. వరుసలో బడా దర్శకులు!!

Update: 2020-12-30 02:30 GMT
తెలుగు ఇండస్ట్రీలో నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా అంటే బాక్సాఫీస్ ఓ రేంజిలో షేక్ అవుతుంది. ఆయనతో ఒకసారి సినిమా చేసిన డైరెక్టర్లు మళ్లీ మళ్లీ  వర్క్ చేయాలనుకుంటారు. బాలయ్యతో అలాంటి బంధం ఏర్పడుతుంది మరి. ఒక డైరెక్టర్ హిట్ ఇచ్చినా.. ఫ్లాప్ ఇచ్చినా అతనితో మళ్లీ సినిమా చేయడానికి బాలయ్య ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో 'బిబి3' చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్ రెస్పాన్స్ దద్దరిల్లింది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు సినిమా అంటే డాన్సులు, ఫైట్లు, డైలాగ్స్ భారీ లెవెల్ లో ఎక్సపెక్ట్ చేస్తారు నందమూరి అభిమానులు. మరి ఈ సినిమాలో ఎలాంటి మ్యాజిక్ చూపించనున్నారో అని ఆసక్తి నెలకొంది. ఇక డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా బాలయ్యతో మరో మూవీ చేయాలనీ కోరుకుంటున్నాడు. ఇదివరకే ఈ విషయం బాలయ్య చెవిలో కూడా వేసాడు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన పైసా వసూల్ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ బాలయ్యకు పూరీ, పూరీకి బాలయ్య తెగ నచ్చేశారు. అప్పట్లో పూరీతో మరో సినిమా చేయడానికి సిద్ధమే అని బాలయ్య చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు పూరీ మరో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట.

ఇదిలా ఉండగా.. బాలయ్య తదుపరి సినిమాల గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. బాలయ్య బోయపాటి తర్వాత పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో ఓ సినిమా ఓకే చేసాడని.. ఆ తర్వాత సమరసింహ రెడ్డి, నరసింహ నాయుడు లాంటి బ్లాక్ బస్టర్స్ అందించిన బి. గోపాల్ తో ఓ మూవీ, అలాగే డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా కథ ఒకటి, డైరెక్టర్ శ్రీనివాస్ కథలతో పాటు తాజాగా డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ కథను ఓకే చేసినట్లు వార్తలొస్తున్నాయి. వీటన్నికంటే ముందు బోయపాటి తర్వాత ఎవరితో సినిమా చేస్తాడనే విషయం ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే యువ హీరోలతో సైతం పోటీ పడుతూ బాలయ్య ఈ ఐదు కథలను లైన్ లో పెడుతున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి.. బాలయ్యకు బ్లాక్ బస్టర్ బ్రేక్ ఇచ్చేది ఎవరో. ఇక బి. గోపాల్ మూవీ స్క్రిప్ట్ దశలో ఉండగా.. పూరీ స్క్రిప్ట్ కూడా రెడీ అవుతుందట. పూరీ ఓ వైపు విజయ్ దేవరకొండతో ఫైటర్ చేస్తూనే బాలయ్య కోసం ఓ మంచి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి  బాలయ్య నుండి ఎలాంటి కబురు రానుందో..!
Tags:    

Similar News