పిక్ టాక్ : బాలయ్య బొమ్మకు భలే గిరాకీ

Update: 2017-01-10 03:07 GMT
విడుదలైన రోజునే తమ అభిమాన హీరో సినిమా చూసి తోటి స్నేహితులకు ఆ చిత్ర విశేషాలు చెప్పాలని ప్రతీ సినీ ప్రియుడికి వుంటుంది. అయితే బడా హీరోల సినిమాలు ఎంత ఘనమైన సంఖ్యగల థియేటర్లలో విడుదల చేసినా తొలిరోజు టిక్కెట్ల ఇక్కట్లు తప్పవు. ఫ్యాన్స్ కోసమని, కార్పోరేట్ బుకింగ్స్ అని, ఆన్ లైన్ సెల్లింగ్ అని అన్నీ మార్గాలలో అయిపోయాక సాధారణ ప్రేక్షకుడికి ఛాన్స్ వస్తుంది.

అసలే పండుగ కావడం అందునా లెజెండ్స్ లాంటి హీరోల చిత్రాలు కావడంతో బ్లాక్ టిక్కెట్ల అమ్మకాలకు బాగానే ఆస్కారం వుంటుంది. గట్టిగా అమ్మితే నెలంతా సరిపడా ఆదాయం వస్తుంది. అయితే ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని ఈ బ్లాక్ టిక్కెటింగ్ కొత్త పుంతలు తొక్కుతుంది.

ఏవైనా వస్తువులను కొనడానికో అమ్మడానికో వాడే ఓ.ఎల్.ఎక్స్ ని ఇప్పుడు బ్లాక్ టిక్కెట్ల మార్పిడి సాధనంగా మార్చుకున్నారు. 80 రూపాయలు పెట్టి కొన్న టిక్కెట్ ని 500 కి విక్రయిస్తున్నట్టు ఓ.ఎల్.ఎక్స్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. బాలయ్య నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రానికి సంబంధించిన పోస్ట్ కావడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News