బాహుబలి ఆడియో తిరుపతిలో?
మే 31న హైదరాబాద్‌లో జరగాల్సిన బాహుబలి ఆడియో అనుకోని కారణాలతో వాయిదా పడిపోయిన సంగతి తెలిసిందే. ఆడియో ఫంక్షన్ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి అన్నది క్లారిటీ లేదని.. మూణ్నాలుగు రోజుల్లో క్లారిటీ వస్తుందని.. మీడియాకు చెబుతానని అన్న రాజమౌళి.. ఈ పది రోజుల్లో ముంబయికి, చెన్నైకి చుడుతూ బిజీ అయిపోయాడు. మధ్యలో 8వ తారీఖు ఆడియో ఫంక్షన్ ఉండొచ్చని వార్తలొచ్చాయి కానీ.. అవి రూమర్లే అని తేలిపోయింది. ఇప్పుడిక కొత్త డేటొచ్చింది. 13వ తేదీన తిరుపతిలో ఆడియో ఫంక్షన్ జరగొచ్చన్నది తాజా సమాచారం.
ఇది మాత్రం రూమర్ కాదని.. పక్కా అని అంటున్నారు. మామూలు సినిమాలకైతే పది పదిహేను రోజుల ముందు ఆడియో రిలీజ్ చేసినా పర్లేదు. కానీ భారీ స్థాయిలో ప్రమోషన్స్ ప్లాన్ చేసి పెట్టుకున్న 'బాహుబలి' సినిమాకు కనీసం నెల రోజుల ముందైనా ఆడియో ఫంక్షన్ చేయకుంటే కష్టం. కాబట్టి జక్కన్న త్వరపడక తప్పట్లేదు. ఐతే తిరుపతిలో ఆడియో ఫంక్షన్ పెట్టడం సరైన నిర్ణయమేనా అన్నదే సందేహం. ఇంతకుముందు ఆడియో ఫంక్షన్ వాయిదా వేసిందే ప్రభాస్ అభిమానులందరినీ సంతృప్తినివ్వలేకపోతున్నామనే. హైదరాబాద్ అంటే సెంటర్లో ఉంటుంది కాబట్టి అటు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇటు తెలంగాణ నుంచి అభిమానులు తరలివస్తారు. కానీ తిరుపతి అంటే ఓ మూల అయిపోతుంది. ముఖ్యంగా తెలంగాణ నుంచి అభిమానులు వెళ్లడం కష్టం. బహుశా.. రుద్రమదేవి టైపులోనే తెలంగాణలో కూడా ఓ సెంటర్ ఎంచుకుని అక్కడ ఆడియో రిలీజ్ చేసే ఆలోచనుండొచ్చేమో.