నెవ్వర్ బిఫోర్.. భీమ్ టీజర్ ఆల్ టైం రికార్డ్

Update: 2020-12-31 03:49 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”. RRR పేరుతో ఫేమస్ అయిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్లలో తారక్ - చరణ్ పెర్ఫార్మెన్స్ కు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే.. ఇందులో భీమ్ టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు నమోదు చేస్తోంది. రామరాజు ఫర్ భీమ్ అంటూ వచ్చిన ఈ టీజర్ ఇప్పటికే 1 మిలియన్ లైక్స్ క్రాస్ చేసింది. ఇక త్వరలో 1 మిలియన్ కామెంట్స్ ను కూడా రీచ్ కాబోతోంది.

ప్రస్తుతం 9 లక్షల కామెంట్స్ తో దూసుకుపోతున్న ఈ టీజర్.. ఇప్పటి వరకూ ఏ తెలుగు టీజర్ కూడా అందుకోలేని రేంజ్ లో ఉంది. అతి త్వరలోనే 1 మిలియన్ లైక్డ్, 1 మిలియన్ కామెంట్స్ క్రాస్ చేసిన మొట్టమొదటి టాలీవుడ్ అండ్ ఇండియన్ టీజర్ గా రికార్డు క్రియేట్ చేయబోతోంది భీమ్ టీజర్. కాగా.. తమిళ్ లో విజయ్ నటించిన “మాస్టర్” టీజర్ కు కూడా ఇదే స్థాయిలో దూసుకుపోతోంది. మరి వీటిలో ఏది ఈ ఫస్ట్ ఎవర్ రికార్డ్ అందుకుంటుందో చూడాలి.

కాగా.. ఆర్ఆర్ఆర్ చిత్రీకరణ చివరిదశకు వచ్చిందని సమాచారం. అయితే.. ఈ మూవీని ఎప్పుడు విడుదల చేయనున్నారనే విషయం ఆసక్తిగా మారింది. మొదట్లో కొన్ని డేట్స్ అనుకున్నప్పటికీ కుదరలేదు. దీంతో.. ఈ సినిమాను దసరాకు రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న.

థియేటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటుండడం.. కొత్త కరోనాా భయం మొదలవడం వంటి కారణాలు ఎలాగో ఉన్నాయి. ఇంకా.. షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవ్వాాలి. ఇవన్నీ పూర్తయ్యే సరికి సమ్మర్ వచ్చేస్తుంది. ఆ లోగా అన్నిపనులూ అయినప్పటికీ.. సినిమాను మాత్రం దసరా సీజన్ కే బరిలో నిలపాలని యోచిస్తున్నాడట దర్శక ధీరుడు. అప్పటికి పరిస్థితులన్నీ చక్కబడడంతోపాటు పండగ సీజన్ కావడంతో మంచి వసూళ్లు వస్తాయని భావిస్తున్నాడట.
Tags:    

Similar News