ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్న ప్రముఖ నిర్మాత రెండో కొడుకు..
ఇండస్ట్రీలోకి స్టార్ హీరోల కొడుకులు, నిర్మాతల కొడుకులు ఎంట్రీ ఇవ్వడం మాములే. కానీ వచ్చాక ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనేది పెద్ద సవాల్. అలా ఎంట్రీ ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ నిలదొక్కుకొని ఇండస్ట్రీలో హీరోగా నిలబడ్డవాళ్లు కొందరే ఉంటారు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్ "అల్లుడు శీను" సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు. నటుడిగా తనని తాను సినిమా సినిమాకు ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు.
అయితే తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా వెండితెరకు పరిచయం కానున్నాడు. నేను కూడా హీరో అవుతా.. అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ కొత్త కుర్రాడు త్వరలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ప్రేమ ఇష్క్ కాదల్, సావిత్రి చిత్రాలను తెరకెక్కించిన పవన్ సాదినేని దర్శకత్వంలో తెరమీదకు రానున్నాడు బెల్లంకొండ గణేష్. గతేడాదే షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా అతి త్వరలోనే విడుదలకు సిద్ధం కానుందని తెలిపారు చిత్రయూనిట్.
ఫుల్ ఎంటర్టైన్ మెంట్ తో తెరకెక్కుతున్న ఈ కొత్త తరహా ప్రేమకథను నల్లమలుపు బుజ్జి నిర్మిస్తుండటం విశేషం. ఒక నిర్మాత కొడుకును మరో నిర్మాత తెరకు పరిచయం చేయడం వెరైటీగా ఉందని కొందరు మాట్లాడుకుంటున్నారు. ఆల్రెడీ తండ్రే నిర్మాతగా ఉండగా ఇంకొకరిని రిస్క్ లో పెట్టినట్లే కదా అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కానీ నిర్మాత నల్లమలుపు బుజ్జి మాత్రం పక్కా క్లారిటీతో ఈ సినిమాను నిర్మిస్తున్నారని చిత్ర దర్శకుడు పవన్ తెలిపాడు. ఇక తమ్ముడి సినిమా కదా అని హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తనవంతు సహాయాన్ని అందిస్తున్నాడట. చూడాలి మరి సినీ ఇండస్ట్రీలో మరో వారసుడి కెరీర్ ఎలా ఉండబోతుందో..