పడ్డానండి ప్రేమలో మరి.. అంటున్న భామ!

Update: 2019-07-15 04:48 GMT
మలయాళం బ్యూటీ అమలా పాల్ సౌత్ అంతా పాపులర్ అయిన భామ. యాక్టింగ్.. గ్లామర్ విషయంలో ఎప్పుడూ ఫుల్ మార్క్స్ తెచ్చుకునే ఈ భామ ఏదో ఒక వివాదంతో అప్పుడప్పుడూ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. అలా అని ఇప్పుడు కొత్తగా ఏ వివాదం లోనూ అమల ఇరుక్కోలేదు. అంతకంటే పెద్ద ప్రమాదం అయిన ప్రేమలో పడిపోయింది.  వివాదం అనుకోండి.. జనాలు నాలుగు రోజులు నోర్లు నొప్పెట్టేలా మాట్లాడి.. చేతులు నొప్పెట్టేలా కామెంట్లు టైప్ చేసి కొద్ది రోజులకు సైలెంట్ అయిపోతారు.  వివాదం సద్దుమణిగిపోతుంది. కానీ ప్రేమ అలా కాదు కదా.. అప్పుడప్పుడూ పెళ్ళికి దారితీస్తుంది. ఆ తర్వాత అదో పే.. ద్ద లైఫ్ సైకిల్.

అమలా తమిళ డైరెక్టర్ ఎఎల్ విజయ్ ను రెండేళ్ళపాటు ప్రేమించి 2014 లో పెళ్ళి చేసుకుంది.  కానీ అమల- విజయ్ ల వైవాహిక జీవితం ఎక్కువకాలం సాఫీగా సాగలేదు. విభేదాల కారణంగా ఇద్దరూ 2017 విడాకులు తీసుకున్నారు.  అప్పటి నుంచి అమలా సింగిల్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తోంది.  ఎఎల్ విజయ్ మాత్రం ఈమధ్యే చెన్నై బేస్డ్ డాక్టర్ ఐశ్వర్యను రెండో వివాహం చేసుకున్నాడు. విజయ్ ఒక ఇంటివాడు అయ్యాడు.. మరి అమలా పాల్ కు కూడా అలాంటి ఆలోచన ఉందా? ఈ టాపిక్  పై అమలా రీసెంట్ గా మాట్లాడింది.

అమలా పాల్ ప్రస్తుతం తన తాజా చిత్రం 'ఆమె' ప్రమోషన్స్ తో బిజీగా ఉంది.  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన లవ్ స్టొరీ గురించి వెల్లడించింది.  గతకొంత కాలంగా ఒక వ్యక్తితో లవ్ లో ఉన్నానని.. ఆయితే ఆయన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి  కాదని క్లారిటీ ఇచ్చింది.  మరి మ్యారేజ్ ఎప్పుడు అని అడిగితే.. ప్రస్తుతానికి పెళ్ళి గురించి ఆలోచించడం లేదని.. తన దృష్టి అంతా కెరీర్ పైనే ఉందని.. కెరీర్ లో బెస్ట్ ఫేజ్ లో ఉన్నానని తెలిపింది. మరి ఈ హాట్ భామను లవ్వులో పడేసిన ఆ హ్యాండ్సమ్ మ్యాన్ ఎవరో త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.  

    

Tags:    

Similar News