పుష్ప 2 పూర్తయాకే బోయపాటికి ఛాన్స్
టాలీవుడ్ లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. ఒక్కోసారి అనుకున్న ప్రాజెక్ట్ వెంటనే ప్రారంభమైపోతుంది. చాలా సందర్భాల్లో ఆలస్యమైనా అవ్వొచ్చు. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న బోయపాటి తదుపరి కమిట్ మెంట్ ప్రకారం.. వెంటనే అల్లు అర్జున్ తో సినిమాని ప్రారంభిస్తారనే అంతా భావించారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. బోయపాటి సుమారు ఏడెనిమిది నెలల పాటు వెయిట్ చేయాల్సిన సన్నివేశం ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
అల్లు అర్జున్ పుష్ప - ది రైజ్ తో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. `పుష్ప: ది రూల్`ను ఫిబ్రవరిలో ప్రారంభించి.. ఏప్రిల్ నుండి రెగ్యులర్ చిత్రీకరణను ప్రారంభించాలనే ప్లాన్ తో ఉన్నారు. ఇది బన్ని షెడ్యూల్ లో ఆకస్మిక మార్పు అని తెలిసింది. పుష్ప1 తెలుగు భాషను మించి హిందీ బెల్ట్ లో అనూహ్య విజయం సాధించింది. అందువల్ల బన్ని దీనిని ఎన్ క్యాష్ చేసుకునేందుకు ప్లాన్ ని ఛేంజ్ చేశాడని గుసగుస వినిపిస్తోంది. `పుష్ప 2`పై తన దృష్టిని సమయాన్ని వెచ్చించాలని భావిస్తున్నాడు. పుష్ప 2ని పూర్తి చేసేవరకు ఎటువంటి కొత్త ప్రాజెక్ట్ లను చేపట్టడు. దీనివల్ల బోయపాటి వేచి చూడాల్సి ఉంటుంది. `పుష్ప 2`తో దాదాపు 9 నెలలు బిజీగా ఉంటాడు. అంటే బోయపాటి అంతకాలం వేచి చూడాల్సిందే.
అఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాతా ఇది ఊహించనిది. బోయపాటి కచ్ఛితంగా వేచి చూడాల్సిందే. అల్లు అర్జున్ - బోయపాటి కాంబినేషన్ లో సరైనోడు బ్లాక్ బస్టర్ హిట్. పైగా బన్ని కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది. కానీ ఇప్పుడిలా వేచి చూడాల్సిన సందర్భం వచ్చింది. ఒకవేళ వేచి చూడాల్సిన సన్నివేశంలో బోయపాటి ఏం చేస్తారు? వేరొక స్టార్ తో ముందుకు వెళతారా? అన్నది వేచి చూడాలి.