అమ్మ బన్నీ.. అక్కడ లింకేశావా!!

Update: 2015-12-23 04:08 GMT
అమ్మ బన్నీ.. అక్కడ లింకేశావా!!
ఇదేదో శాస్ర్తం చెప్పినట్లు.. మామూలుగా అల్లు అరవింద్‌ గారే పెద్ద కంచు అంటారు. కాని వాస్తవానికి బన్నీ అంతకంటే కంచున్నర కంచు అట. ఎందుకంటే మనోడు ఒక పట్టాన సినిమా కథలను ఓకే చేయకపోగా.. ఎవరన్నా ఒక ప్రాజెక్టులో బిజీగా ఉన్న డైరక్టర్‌ కథ చెబితే.. ఆ కథలో మార్పులు చెప్పడానికి సరైన టైము చూసి కొడతాడట. ఇదిగో ఈ ఎగ్జాంపుల్‌ చూడండి.

మనం సినిమా ఫేం విక్రమ్‌ కె కుమార్‌ ఒక సినిమా లైన్‌ వినిపంచేశాడు మన స్టయిలిష్‌ స్టార్‌ కు. అయితే ఈ కథను బాగానే ఉందనేసిన బన్నీ.. కొన్ని ఛేంజస్‌ చెప్తా అన్నాడట. కాని వాటిని ఇప్పుడు చెప్పను.. మీ కొత్త సినిమా రిలీజ్‌ అయ్యాక చెప్తా అన్నాడట. ప్రస్తుతం సూర్యతో కలసి టైమ్‌ మెషీన్‌ నేపథ్యంలో 24 సినిమాను చేస్తున్నాడు విక్రమ్‌. ఈ సినిమా హిట్టయితే.. తనకు చెప్పిన కతపై ఒకలాంటి సూచనలు చేస్తాడట బన్నీ. ఒకవేళ తేడా పడితే అప్పుడు మరో రకం చేంజెస్‌ చెప్తాడట. అదేంటో తెలియదు కాని.. దర్శకుడు హిట్‌ ఆర్‌ ఫ్లాప్‌ స్టాటస్‌ బట్టి బన్నీ కథలో మార్పులు సూచిస్తాడంటే కొత్తగా ఉంది.

గతంలో రేసుగుర్రం సినిమా టైములో మొత్తం క్లయ్‌ మ్యాక్స్‌ అంతా ఒక ఫార్మాట్‌ లో షూట్‌ చేశాక.. దానిని పక్కనెట్టేసి.. కొత్తగా కిల్‌ బిల్‌ పాండే సీన్లను యాడ్‌ చేసి షూటింగ్‌ చేయించిన ఘనత కూడా బన్నీదేనట. దర్శకుడు ఫ్లాపుల్లో ఉంటే బన్నీ అలా సూచిస్తాడని ఒక టాక్‌. ఏదేమైనా.. దర్శకుడి కరెంట్‌ హిట్ ఆర్‌ ఫ్లాప్‌ స్టాటస్‌ బట్టి కథలను లింక్‌ చేయడం అనేది కొత్తగానే ఉంది.
Tags:    

Similar News