మేక‌ప్ లేకుండా అలియాని చూడ‌లేమా?

Update: 2022-01-08 02:30 GMT
మేక‌ప్ లేనిదే హీరోయిన్లు కెమెరా ముందుకు రారు. హీరోయిన్ల అద‌న‌పు హంగు.. బ్యూటీ అంతా మేక‌ప్ తోనే ముడిప‌డి ఉంటుంది. నేచుర‌ల్ బ్యూటీని చూపించ‌డానికి ఏ హీరోయిన్ ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌రు.  అరుదైన సంద‌ర్భాల్లో మాత్ర‌మే మెక‌ప్ లెస్ గా బ‌య‌ట క‌న‌బ‌డుతుంటారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భ‌ట్ అలా  స‌హ‌జంగా కెమెరాకి ఫోజులిచ్చిన కొన్ని ఫోటోలిప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. అలియా భ‌ట్ ఎలాంట‌లి బ్యూటీ ప్రోడ‌క్స్ట్ ఉప‌యోగించ‌కుండా త‌న బేర్  స్కిన్ ని చూపించే ప్ర‌య‌త్నం చేసింది. మేక‌ప్ లుక్ లో ముఖంపై చిన్న మ‌చ్చ కూడా క‌నిపించ‌దు.

కానీ ఇక్క‌డ అలియా ముఖాన్ని క్లోజ్ గా చూస్తే  ముఖంపై మొటిమ‌లు కార‌ణంగా వ‌చ్చిన చిన్న పాటి మ‌చ్చ‌లు హైలైట్ అయ్యాయి. అలియా పెద‌వుల‌కు లైట్ గా లిప్ స్టిక్ పూసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. క్యూట్ స్మైల్ తో ఉన్నా పిక్  వైర‌ల్ గా మారింది. మేక‌ప్ లేని  అంద‌మైన బ్యూటీ అంటూ నెటిజ‌నులు ఈ ఫోటోల‌కు కామెంట్లు చేస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ఎలాంటి మేక‌ప్ లేకుండా బ‌య‌ట ఎక్కువ‌గా క‌నిపించే హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి ఒక‌రు. ముఖంపై మ‌చ్చ‌లు ఉన్నా వాటిని మ్యాక‌ప్ తో క‌వ‌ర్ చేయ‌డానికి ఎంత‌మాత్రం సాయిప‌ల్ల‌వి ఇష్ట‌ప‌డ‌దు. ఆ ర‌కంగా సాయి ప‌ల్ల‌వి నేచుర‌ల్ బ్యూటీగా పేరు సంపాదించింది.

ఇక అలియా భ‌ట్ సినిమాల విష‌యానికి వ‌స్తే పాన్ ఇండియా చిత్రం `ఆర్ ఆర్ ఆర్` తో బ్యూటీ తెలుగులో లాంచ్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న సీత పాత్ర‌లో న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఆ పాత్ర లుక్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంది. ఇక బాల‌వుడ్ లో అలియా బిజీ షెడ్యూల్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. కుర్ర హీరోల నుంచి సీనియ‌ర్ హీరోల వ‌ర‌కూ అంద‌రితోనూ క‌లిసి న‌టిస్తోంది. న‌టిగా చాలా త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ హీరోయిన్ల స‌ర‌స‌న స్థానం ద‌క్కిచుకుంది. ఆలియా న‌టించిన బ్ర‌హ్మాస్త్ర‌.. గంగూభాయి క‌తియావాడీ చిత్రాలు కూడా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. బ్ర‌హ్మాస్త్ర భారీ పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్క‌గా .. గంగూభాయి చిత్రానికి క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News