రణబీర్-అలియా కొత్త కాపురం కత్రినా జ్ఞాపకాల్లోనా?
వివాహం తర్వాత రణబీర్ కపూర్-అలియాభట్ దంపతులు కొత్త కాపురం కృష్ణ-రాజ్ బంగళాలో మొదలు పెట్టాలనుకున్న సంగతి తెలిసిందే. తన పూర్వీకుల జ్ఞాపకాలు ఆ ఇంట్లోనే ఉండటం సహా తండ్రి రిషీ కపూర్ కోరిక మేరకు ఆ ఇంట్లోనే రణబీర్ కొత్త కాపురం పెట్టాలి. కానీ అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. ఇంటికి సంబంధించి రీ మోడలింగ్ పనులు మరికొన్ని నెలలు పాటు సాగేలే కనిపిస్తున్నాయి. తల్లి నీతూకపూర్ ఆదేశాల మేరకు కొన్ని నెలలుగా ఆ పనులు సాగుతున్నా ఇంకా పూర్తి కాలేదు.
వాస్తవానికి పెళ్లి ఆఇంట్లోనే చేసి..అక్కడ కాపురం పెట్టించాలని నీతూకపూర్ భావించారు. కానీ పనులు పూర్తవ్వడానికి ఇంకా ఆరు నెలకు పైగా సమయం పడుతుందని ఇంజనీర్లు చెప్పడంతో నిర్ణయం మార్చుకున్నారు. ఆ బంగళాకి అరకిలోమీటర్ దూరంలోఉన్న వాస్తు భవంతిలో పెళ్లి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడే కొత్త కాపురం కూడా తాత్కాలికంగా పెట్టాల్సి వస్తోందిట. ఈ ఇంటిలో ఉండటం రణబీర్ కి కొత్తేం కాదు. గతంలో ఇదే ఇంట్లో కత్రినా కైప్ తో ప్రేమాయణం నడిపే సమయంలో ఉన్నాడుట.
మళ్లీ ఇప్పుడు అలియాని వేద మంత్రాలు సాక్షిగా పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆమెతో పాటు వాస్తు భవంతిలో కలిసి ఉండాల్సి వస్తోందిట. ఈ భవంతిలో పెద్దగా ప్రత్యేకతలు ఏమీ ఉండవట. పేరుకే ఆరు అంతస్థుల భవంతి తప్ప సౌకర్యాల పరంగా తక్కువగానే ఉంటాయని సమాచారం. కానీ తప్పదు. ప్రస్తుతానికి అలియాతో కలిసి అక్కడే కాపురం చేయాలి.
ఇక కృష్ణ రాజ్ బంగళాకి చాలా ప్రతయేకత ఉంది. ఈ ఇంటిని రిషీ కపూర్ తన తల్లి దండ్రులు రాజ్ కపూర్- కృష్ణ కపూర్ పేరు మీదుగా ఎంతో వైభవంగా..విలాసవంతంగా నిర్మించారు. భవంతి కాస్త పాత పడింది కానీ అద్భుతమైన కట్టడం. రీమోడలింగ్ చేస్తే అద్భుతంగా తయారవుతుంది. అందుకే నీతూకపూర్ కోట్లరూపాయలు వెచ్చించి మరీ పాత బిల్డింగ్ ని రిపేర్లు చేయిస్తున్నారు. ఆ పనుల పూర్తవ్వడానికి డిసెంబర్ పూర్తవుతుందని అంటున్నారు.
డిసెంబర్ 14న తాతయ్య రాజ్ కపూర్ జయంతి. మరి ఆలోపు పూర్తయితే షిప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే కొన్నాళ్ల పాటు వాస్తు భవంతిలో ఉండక తప్పదు. ఇక రణబీర్ -అలియా అప్పుడే షూటింగ్ ల్లో బిజీ అయిన సంగతి తెలిసిందే. ముబై స్టూడియోల్లో రణబీర్ బిజీగా గడుపుతుంటే...`రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహాని` షూటింగ్ కోసం అలియా జైసల్మేర్ లో ఉంది.