చిరు కొత్త సినిమాలో ఖిలాడీ ఎంట్రీ?

Update: 2017-03-25 12:35 GMT
మెగాస్టార్ చిరంజీవి 9 ఏళ్ల తర్వాత ఫిలిం ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటేశారు. అలాగే ఇండస్ట్రీ హిట్ కూడా ఖాతాలో వేసేసుకున్నారు. తన 150వ చిత్రంతో తిరుగులేని విజయం సాధించి.. ఇప్పుడు 151 చిత్రానికి సిద్ధమవుతున్నారు మెగాస్టార్.

చిరంజీవి 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ఇప్పటికే ఖాయమైంది. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను చిరు స్వయంగా చేయనున్నారట. అదే రోజున సినిమాలో నటించే కీలక పాత్రధారులను కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ఇప్పటికే కొన్ని కీలక పాత్రలకు సంబంధించి క్యాస్టింగ్ పై క్లారిటీకి వచ్చేశారట. ఉయ్యాలవాడ మూవీలో ఓ కీలకమైన రోల్ కు.. బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ ను తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ ను కూడా చూసే అవకాశం తెలుగు ప్రేక్షకులకు దక్కనుంది. అయితే.. అక్షయ్ కు ఆఫర్ చేసిన రోల్ ఏంటనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. కానీ ఖిలాడిని పట్టుకురావాలని చూస్తున్నారంటే.. ఖచ్చితంగా అది లీడ్ రోల్స్ లో ఒకటి అనడంలో సందేహం అక్కర్లేదు. అక్షయ్ ఎంట్రీ కారణంగా.. మెగా 151కు బాలీవుడ్ లో కూడా క్రేజ్ రావడం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News