• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తమిళ హీరో తొలి తెలుగు...

తమిళ హీరో తొలి తెలుగు సినిమాలో కిక్కిచ్చే స్టార్..!

By - Tupaki Desk
Update: 2022-04-27 15:30 GMT
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది విజయ్ కెరీర్ లో 66వ సినిమా. ఈ స్ట్రెయిట్ తెలుగు మూవీతో తమిళ హీరో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారు.

Thalapathy66 సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ నటుడు శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో మరో ప్రముఖ నటుడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు మంగళవారం చిత్ర బృందం ప్రకటించింది.

హీరో శ్యామ్ ఈ సినిమాలో భాగం అవుతున్నారని మేకర్స్ తెలిపారు. 'కిక్' సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన శ్యామ్.. పార్ట్నర్ పార్ట్నర్ అంటూ రవితేజకు ధీటుగా మంచి మార్కులు కొట్టేసాడు. ఇదే క్రమంలో 'రేసుగుర్రం' 'ఊసరవెల్లి' 'కిక్ 2' 'వీర' 'కత్తి' 'యాక్షన్ 3D' వంటి చిత్రాల్లో నటించారు శ్యామ్.

ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న కిక్ శ్యామ్.. ఇప్పుడు ఇంకా పేరు పెట్టని సినిమాలో విజయ్ కి బ్రదర్ గా కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. 2000 లో వచ్చిన 'ఖుషీ' చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. 22 ఏళ్ల తర్వాత మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు - శిరీష్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. కార్తీక్ పలనీ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.

డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మార్కెట్ ఏర్పరచుకున్న తమిళ హీరోలలో విజయ్ ఒకరు. 'మాస్టర్' సినిమాతో సక్సెస్ అందుకున్న స్టార్ హీరో.. ఇటీవల ''బీస్ట్'' చిత్రంతో నిరాశ పరిచారు. మరి ఇప్పుడు 'మహర్షి' దర్శకుడితో కలిసి చేస్తోన్న.. స్ట్రెయిట్ తెలుగు మూవీతో టాలీవుడ్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
Tags:    
  • Vamsi Paidipally 
  • Actor Shyam 
  • Thalapathy 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

జగపతిబాబు బిజినెస్ ఐడియాకు చంద్రబాబు కౌంటర్!

2026-11-10 05:39 GMT

హీరో పర్సనల్ ఇష్యూల కారణంగా వరుస ఫెయిల్యూర్స్

2026-11-10 05:14 GMT

తెలుగు హీరో 'సీన్' కోసం చర్చలు..?

2026-11-10 05:04 GMT

సూర్య@650+కోట్లు... అరుదైన రికార్డ్

2026-11-10 04:36 GMT

రామాయణ రెస్పాన్స్... జక్కన్న మహాభారతం టైమ్ వచ్చిందా?

2026-11-10 04:35 GMT

పదేళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యే టైం వచ్చిందా?

2026-11-10 04:35 GMT

'రంగ‌స్థ‌లం' చిట్టి బాబును..'పుష్ప‌' పుష్ప‌రాజ్‌ను మించేలా..!

2026-11-10 03:51 GMT

అత్త‌మ్మ‌తో అల్లు కోడ‌ళ్లు వెరీ స్పెష‌ల్ దీపావ‌ళి

2026-11-10 03:51 GMT

ఎందుకు ఇబ్బంది పెడతారు.. రేణు దేశాయ్ ఫైర్

2026-11-10 03:50 GMT

కోడ‌ళ్ల‌తో అక్కినేని స్పెష‌ల్ దీపావ‌ళి సంబ‌రాలు

2026-11-10 03:49 GMT

Bigg Boss Telugu: నామినేషన్స్ లో బిగ్‌ బాస్ అదిరిపోయే ట్విస్ట్!

2026-11-10 03:47 GMT

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS