టీజర్ టాక్: 100 పర్సెంట్ యాక్షన్ ఫిలిం!

Update: 2019-09-13 16:45 GMT
హీరో విశాల్ అంటేనే యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. ఈసారి విశాల్ సుందర్.సీ  దర్శకత్వంలో మరోసారి పవర్ ఫుల్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. సినిమా పేరు 'యాక్షన్'.  ఈ సినిమా టీజర్ శుక్రవారం సాయంత్రం విడుదల అయింది. ఒక నిముషానికి పైగా నిడివి ఉన్న ఈ టీజర్ లో టైటిల్ కి తగ్గట్టే ఫుల్ యాక్షన్ ఉంది.

అన్నీ ఫారెన్ లొకేషన్లు.. రన్నింగులు.. ఛేజింగులు.. జంపింగులు.. బ్లాస్టింగులు..ఇలా చెప్పుకుంటూ పోతే ఒక యాక్షన్ సినిమాలో ఉండాల్సిన అన్ని హంగులూ ఇందులో ఉన్నాయి. ఇక దీనికి తోడుగా కలర్ ఫుల్ పాటలు.  గ్రీన్ కలర్ బికినీలో నడుస్తున్న భామ.. ఇలా సినిమాలో యాక్షన్ ప్రియులకు కావాల్సిన మసాలా ఎలిమెంట్స్ ను అన్నిటిని చొప్పించారు.  యాక్షన్ సీక్వెన్సులలో విశాల్ ఎలా రెచ్చిపోతాడో అందరికీ తెలిసిందే.  అసలు నటన సంగతి పక్కన పెట్టి యాక్షన్ సినిమాల హీరోకు అవార్డులు ఇవ్వాలనుకుంటే అవన్నీ విశాల్ ఇంటికి పట్టుకుపోతాడు. అలాంటి వాడు సినిమా టైటిలే 'యాక్షన్' అని పెడితే రెచ్చిపోకుండా ఉంటాడా?  ఫుల్ గా తనలోని యాక్షన్ హీరోను బైటకు తీసిమరీ యాక్షన్ సీన్లలో దుమ్ము దులిపాడు.

ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ తమన్నానే కానీ టీజర్ లో వచ్చిన గ్రీన్ కలర్ బికినీలో కనిపించిన హాట్ బ్యూటీని చాలామంది తమన్నా అని పొరపాటుపడే అవకాశం ఉంది కానీ ఆ భామ  తమన్నా కాదు.   ఆ బ్యూటీ ఎవరంటే మథుర్ భండార్కర్ బాలీవుడ్ చిత్రం 'క్యాలెండర్ గర్ల్స్' లో మెరిసిన భామ ఆకాంక్ష పూరి.  ఇక ఓవరాల్ గా టీజర్ ఎలా ఉంది అంటే.. ఫుల్ యాక్షన్ అప్పా.. కళ్ళార్పకుండా చూసేయండి.  అంత ఫాస్టుగా ఉన్నాయి సీన్లు.  మీరు కళ్ళు మూసి తెరిచేలోపు సీన్ మారిపోయే ఛాన్స్ ఉంది.


Full View

Tags:    

Similar News