• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమీర్ ఖాన్ ను ఎందుకు...

అమీర్ ఖాన్ ను ఎందుకు తీసుకొచ్చినట్లు? ఆ లెక్కలేంది?

By - Tupaki Desk
Update: 2021-09-21 02:30 GMT
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శేఖర కమ్ముల ‘లవ్ స్టోరీ’ విడుదల ఈ వారమే అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇద్దరు మెగాస్టార్లు విచ్చేయటం ఆసక్తికరంగా మారింది. అందులో ఒకరు బాలీవుడ్ మెగాస్టార్ అమీర్ ఖాన్ అయితే.. రెండోవారు మెగా పదానికి నిలువెత్తు రూపంగా ఉండే చిరంజీవి. తెలుగు సినిమా ఫంక్షన్ కు అమీర్ ఖాన్ రావటం చాలా అరుదైన విషయం. అందునా.. లవ్ స్టోరీ ఫంక్షన్ కు ఆయన రావటం ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.

చాలామంది మదిలో మెదిలే ఈ సందేహానికి సమాధానం చెబుతున్నారు ఈ చిత్ర యూనిట్. అమీర్ నటించిన లాల్ సింగ్ చద్దా మూవీలో నాగచైతన్య నటించారు. దాదాపు 45 రోజుల పాటు ఈ సినిమా కోసం అతను పని చేశాడు. ఆ సందర్భంగా అమీర్ తో ఏర్పడిన అనుబంధమే.. తన తాజా మూవీ వేడుకకు ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని అమీర్ తన ప్రసంగంలోనూ చెప్పుకొచ్చారు.

లవ్ స్టోరీ ట్రైలర్ చూసినంతనే.. బాగుందని చైతూకు తాను మెసేజ్ చేసినట్లు చెప్పారు. తన సినిమా సెట్స్ వచ్చిన నాగచైతన్యను చూసినంతనే.. ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉన్న ఫీలింగ్ కలిగిందన్నారు.చైతూ చాలా మంచి వ్యక్తి. సౌమ్యుడు.. సంస్కారవంతుడు.. లవ్ స్టోరీ మూవీని థియేటర్ లో చూస్తాను. ముంబయిలో కుదరకపోతే.. అధికారులతో మాట్లాడి.. ప్రత్యేక షో వేయించుకొని మరీ చూస్తానని పేర్కొన్నారు.

అమీర్ మాటలు చాలు.. తాజా ఫంక్షన్ కు ఆయన ఎందుకు వచ్చారో ఇట్టే అర్థమవుతుంది. దీనికి తోడు.. అమీర్ లాంటి బాలీవుడ్ అగ్రనటుడు వచ్చాడంటే.. అందరి ఫోకస్ ఈ సినిమా మీద మరింత పడటంతో పాటు.. ఈ సినిమా మీదా అంచనాలు పెంచేందుకు సాయం చేస్తుందని చెబుతున్నారు. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఏషియన్ మల్టీప్లెక్సుల అధినేత భరత్ నారంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకున్న నెట్ వర్కు.. ఈ సినిమాకు మరింత హైప్ తీసుకురావటం కోసం ఎంతో కష్టపడుతున్న ఆయన.. అమీర్ లాంటి అగ్రనటుడి కారణంగా సినిమాకు ప్లస్ అవుతుందంటే వదులుతారా? ఈ లెక్కలే.. అమీర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చేలా చేసిందన్న మాట వినిపిస్తోంది.




Tags:    
  • love story 
  • movie 
  • nagachaithanya 
  • Sai pallavi 
  • Shekar kamula 
  • pre-release function 
  • Aamir Khan 

Similar News

జగపతిబాబు బిజినెస్ ఐడియాకు చంద్రబాబు కౌంటర్!

2026-11-10 05:39 GMT

హీరో పర్సనల్ ఇష్యూల కారణంగా వరుస ఫెయిల్యూర్స్

2026-11-10 05:14 GMT

తెలుగు హీరో 'సీన్' కోసం చర్చలు..?

2026-11-10 05:04 GMT

సూర్య@650+కోట్లు... అరుదైన రికార్డ్

2026-11-10 04:36 GMT

రామాయణ రెస్పాన్స్... జక్కన్న మహాభారతం టైమ్ వచ్చిందా?

2026-11-10 04:35 GMT

పదేళ్ల రికార్డ్ బ్రేక్ అయ్యే టైం వచ్చిందా?

2026-11-10 04:35 GMT

'రంగ‌స్థ‌లం' చిట్టి బాబును..'పుష్ప‌' పుష్ప‌రాజ్‌ను మించేలా..!

2026-11-10 03:51 GMT

అత్త‌మ్మ‌తో అల్లు కోడ‌ళ్లు వెరీ స్పెష‌ల్ దీపావ‌ళి

2026-11-10 03:51 GMT

ఎందుకు ఇబ్బంది పెడతారు.. రేణు దేశాయ్ ఫైర్

2026-11-10 03:50 GMT

కోడ‌ళ్ల‌తో అక్కినేని స్పెష‌ల్ దీపావ‌ళి సంబ‌రాలు

2026-11-10 03:49 GMT

Bigg Boss Telugu: నామినేషన్స్ లో బిగ్‌ బాస్ అదిరిపోయే ట్విస్ట్!

2026-11-10 03:47 GMT

దీపావ‌ళి లుక్‌తో క‌ట్టి ప‌డేసిన న‌టి కం గాయ‌ని

2026-11-09 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS