కామెడీ మూవీ ట్రై చేయ‌బోతున్న విలక్షణ దర్శకుడు..?

Update: 2020-12-09 00:30 GMT
తెలుగు తమిళ భాషల్లో వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వి.ఐ. ఆనంద్. 'హృదయం ఎక్కడ ఉన్నది' అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆనంద్.. 'అప్పుచ్చి గ్రామమ్' అనే తమిళ్ సినిమా రూపొందించాడు. ఆ తర్వాత సందీప్ కిషన్ తో 'టైగర్' సినిమా తీసి అందరి దృష్టిలో పడ్డాడు. ఇక యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నాడు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాతో వి ఐ ఆనంద్ కి క్రేజీ ఆఫర్స్ వచ్చి చేరాయి.

ఈ క్రమంలో విఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ - సురభి హీరోహీరోయిన్లుగా 'ఒక్కక్షణం' అనే సినిమా వచ్చింది. పారలెల్ వరల్డ్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా హిట్ గా నిలిచింది. దీంతో మాస్ మహారాజ్ రవితేజ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు ఆనంద్. పాయల్ రాజ్ పుత్ - నభా నటేష్ హీరోయిన్లుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిలిం డిజాస్టర్ గా మిగిలిపోయింది. దర్శకుడు విఐ ఆనంద్ తో పాటు రవితేజ కెరీర్ కు కూడా 'డిస్కోరాజా' మైనస్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు డిఫ‌రెంట్ కాన్సెప్ట్స్ తో సినిమాలు చేసిన విఐ ఆనంద్.. ఈసారి కాస్త గ్యాప్ తీసుకుని త‌న గ్రాఫ్ మారుస్తున్న‌ట్లుగా సమాచారం. ఓ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ చేయడానికి ఆనంద్ సన్నాహాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
Tags:    

Similar News