ఆర్ఆర్ఆర్ బ్యూటీ కెరీర్ లో '2020 మోస్ట్ వరస్ట్ ఇయర్' అంట!!
2020 సంవత్సరం ప్రతి ఒక్కరి లైఫ్ లో మర్చిపోలేని సంఘటనలు తీసుకొచ్చింది. ఏడాది మొదలైన టైం నుండి ఇప్పుడు ఎండింగ్ వరకు సామాన్య జనాలతో పాటు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు కూడా గడ్డు కాలాన్ని అనుభవిస్తున్నారు. ఈ ఏడాది కరోనా ప్రభావం కావచ్చు, సుశాంత్ సూసైడ్ కేసు కావచ్చు, సోషల్ మీడియా ట్రోల్స్ కావచ్చు లేదా సినిమాలు ప్లాప్ అవ్వడం కావచ్చు. ఇవన్నీ ఎదుర్కున్న బాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే.. అలియా భట్. ఈ అమ్మడి పేరు పలుమార్లు కేసుల వరకు కూడా వెళ్ళింది. ఎప్పుడైతే సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడో.. అందులో ప్రధాన నిందితులు అంటూ కరణ్ జోహార్, అలియా సినిమాలపై సినీ ప్రేక్షకులు రివెంజ్ తీర్చుకున్నారు. ఎందుకంటే అటు కరణ్ నిర్మించిన గుంజన్ సక్సేనా బయోపిక్ పై నెగటివ్ వర్షం కురిసింది. ఇక అలియా నటించిన 'సడక్ 2″ మూవీ ట్రైలర్ పై డిస్ లైక్స్ తో ప్రతాపం చూపించారు. సుశాంత్ ఆత్మహత్య పై స్పందించే వారంతా సోషల్ మీడియాలో అలియాను ట్రోల్ చేశారు.
'సడక్ 2' ట్రైలర్ ప్రపంచంలోనే అత్యంత డిస్ లైక్స్ పొందిన వీడియోగా రికార్డులో కెక్కింది. ఇదిలా ఉండగా.. నేపోటిజమ్ అంటూ ఆ కారణంతో హాట్ స్టార్ లో విడుదలైన సడక్-2 సినిమాను డిజాస్టర్ చేశారు సినీ ప్రేక్షకులు. ఈ ఏడాది అంతలా దరిద్రాన్ని చూసింది అలియా అంటూ వార్తలొస్తున్నాయి. అసలే ఈ ఏడాది పలువురు లెజెండ్ సెలబ్రిటీలను కోల్పోతే.. ఇటు అలియా మరో విధంగా అనుకోని వివాదాలలో నిలిచింది. ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొన్న అలియా పై నెటిజన్లు సీత పాత్రకు ఆమె కరెక్ట్ కాదంటూ ట్వీట్స్ చేశారు. ఇక ఇటీవల తను నటించనున్న గంగుభాయ్ కతియావాడి మూవీ కేసులో ఇరుక్కుంది. సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కించునున్న గంగుభాయ్ బయోపిక్ నిలిపివేయాలని డైరెక్టర్ పై, అలియా పై కేసు కూడా నమోదు అయింది. కేసు కోర్టు వరకు కూడా వెళ్ళింది. ఇక ఈ సినిమా విషయం జనవరిలో తేలనుంది. ఇలా ఇన్ని విధాలుగా అలియా ఈ ఏడాది ఎన్ని కష్టాలు పడాలో అన్ని పడుతోంది. చూడాలి మరి అలియాకి 2021 ఎలా ఉండబోతుందో..!!