పోల్ రిపోర్ట్: 2020 ఉత్తమ తెలుగు చిత్రం..?

Update: 2020-12-30 10:30 GMT
2020 సంవత్సరం అందరితోపాటే సినీ ఇండస్ట్రీకి కూడా కలిసి రాలేదనే చెప్పాలి. ఈ ఏడాది మొదటి రెండు నెలలు కొన్ని సినిమాలు థియేటర్స్ లో సందడి చేయగా.. మిగతా పది నెలలు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ సినిమాలు సందడి చేశాయి. టాలీవుడ్ విషయానికొస్తే 2020 ఫస్ట్ క్వార్టర్ లో 'సరిలేరు నీకెవ్వరు' 'అల వైకుంఠపురంలో' 'భీష్మ' 'హిట్' 'పలాస 1978' వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాయి. మిగతా సినిమాలన్నీ ఓటీటీలలో విడుదల కాబడ్డాయి. వాటిలో కొన్ని మంచి టాక్ తో ఎక్కువ వ్యూయర్ షిప్ దక్కించుకోగా.. కొన్ని సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. ఇక ఈ ఏడాది థియేట్రికల్ మరియు డిజిటల్ రిలీజులలో 'ఉత్తమ చిత్రం' ఏదని 'తుపాకీ డాట్ కామ్' నిర్వహించిన పోల్ లో క్రింది విధంగా రిజల్ట్స్ వచ్చాయి.

2020లో ఉత్తమ తెలుగు చిత్రం ఏది? అని పెట్టిన ఈ పోల్ లో 'సరిలేరు నీకెవ్వరు' 'అల వైకుంఠపురంలో' 'భీష్మ' 'హిట్' 'జాను' 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' 'కలర్ ఫోటో' 'మిడిల్ క్లాస్ మెలోడీస్' 'పలాస 1978' చిత్రాలను పెట్టడం జరిగింది. ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'అల వైకుంఠపురంలో' సినిమా అత్యధిక ఓట్స్ రాబట్టి ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 40.49 శాతం మంది ఓట్లు రాబట్టుకుంది. సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఈ చిత్ర విజయంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ప్రధాన పాత్ర పోషించాడని చెప్పవచ్చు. ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ అందుకున్న బన్నీ.. అనేక రికార్డులను తిరగరాసాడు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా 12.88 శాతంతో రెండో స్థానంలో ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా.. మహేష్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.

డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదలైన 'కలర్ ఫోటో' సినిమా 12.24% తో థర్డ్ ప్లేస్ లో ఉంది. సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో హాస్యనటుడు సుహాస్‌ - చాందినీ చౌదరి జంటగా నటించిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ - రష్మిక మందన్న జంటగా నటించిన 'భీష్మ' సినిమా 8.42 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఆ తర్వాత సత్యదేవ్ హీరోగా నటించిన 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' 7.72% తో ఐదో ప్లేస్ లో ఉంది. కరుణ కుమార్‌ దర్శకత్వంలో రక్షిత్‌ - నక్షత్ర - రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించిన 'పలాస 1978' చిత్రం 6.92 శాతం ఓట్లతో ఆరో స్థానంలో నిలిచింది. సమాజంలో కుల వర్ణ వివక్ష గురించి.. సామాజికంగా వెనుకబడిన కులాలకు చెందిన వారిని రాజకీయంగా ఏవిధంగా దోచుకుంటున్నారో అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రాన్ని బన్నీ సైతం ప్రశంసించాడు. ఇక ఆనంద్ దేవరకొండ 'మిడిల్ క్లాస్ మెలోడీస్' (5.35%).. విశ్వక్ సేన్ 'హిట్' (4.09%).. శర్వానంద్ - సమంత నటించిన 'జాను' (1.88%) తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
Tags:    

Similar News