గ్యాప్ తర్వాత బ్లాస్ట్‌కి రెడీ అవుతున్న స్టార్ డైరెక్టర్
దర్శకుడిగా ఎన్నో విభిన్న చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన అనురాగ్ కశ్యప్ ఈ మధ్య కాలంలో నటనపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు ఉన్నాడు.;
దర్శకుడిగా ఎన్నో విభిన్న చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన అనురాగ్ కశ్యప్ ఈ మధ్య కాలంలో నటనపై ఎక్కువ దృష్టి పెట్టినట్లు ఉన్నాడు. అందుకే గత ఏడాదిలో ఈయన దర్శకత్వం నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. 2023లో ఈయన దర్శకత్వంలో వచ్చిన కెన్నెడీ తర్వాత ఇప్పటి వరకు మరే సినిమా రాలేదు. నటుడిగా విలక్షణ పాత్రలు చేయడం ద్వారా ఆకట్టుకుంటున్న అనురాగ్ కశ్యప్ ఆ మధ్య దర్శకత్వం పై ఆసక్తి లేదని, హిందీలో సినిమాలు చేయను అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కానీ ఆయన తన మనసు మార్చుకున్నట్లుగా ఉన్నాడు. అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం అందుతోంది.
నిశాంచీ పోస్టర్ రిలీజ్
అనురాగ్ దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న 'నిశాంచీ' సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. ఆయన గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా కాస్త బోల్డ్‌గా ఉండబోతున్నట్లు పోస్టర్ ను చూస్తే అర్థం అవుతుంది. సింపుల్ కథ, కథనంతో ప్రేక్షకులను మెప్పించడంలో అనురాగ్ సినిమాలకు పెట్టింది పేరు. అందుకే నిశాంచీ సినిమా సైతం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని పోస్టర్‌ను చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నిర్మాణ సంస్థ అఫిషియల్‌గా ఈ పోస్టర్‌ను షేర్ చేయడం జరిగింది. పోస్టర్ చూస్తుంటే సినిమా స్టార్ కాస్టింగ్ భారీగా ఉంటుందని తెలుస్తోంది. అనురాగ్ కశ్యప్ సినిమాలోని పాత్రలు సింపుల్‌గా ఉంటాయి. ఈ సినిమాలోనూ అలాగే పాత్రలు ఉంటాయని పోస్టర్‌ను చూస్తే అర్థం అవుతుంది.
సయ్యారా తరహా సినిమాలు..
ఐశ్వర్య ఠాక్రే, పింటో, మహ్మద్ జీషన్, కుముద్ మిశ్రా, మోనికా పన్వర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్ ఇండియా రిలీజ్ చేయబోతుంది. ఇండియాలో థియేట్రికల్ రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. హిందీలో ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు మెల్ల మెల్లగా ఆధరణ దక్కుతుంది. మంచి కంటెంట్ తో వస్తే తప్పకుండా భారీ విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అని సయ్యారా సినిమాతో పాటు పలు సినిమాలు నిరూపించాయి. కనుక అనురాగ్ కశ్యప్ ఈ సినిమాతో ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అనురాగ్ కశ్యప్ రీ ఎంట్రీ
1990ల్లో అనురాగ్ కశ్యప్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. కాలం మారుతున్నా కొద్ది ఆయన సినిమాలకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. దాంతో ఆయన సినిమాలను తగ్గించాడు అని కొందరు అంటూ ఉంటారు. విభిన్న సినిమాలు తీసిన అనురాగ్ కశ్యప్ వరుసగా ఫ్లాప్స్ పడటంతో దర్శకత్వంపై ఆసక్తి కోల్పోయినట్లు ఒకానొక సమయంలో అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా ఆయన మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీకి సిద్ధం అయ్యాడు. నిశాంచీ సినిమాతో ఖచ్చితంగా ఒక బ్లాస్ అన్నట్లుగా హిట్ కొట్టేడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈమధ్య కాలంలో మంచి కంటెంట్ సినిమాలకు డిమాండ్ బాగా ఉంటుంది. అందుకే ఈ సినిమాను బాక్సాఫీస్ వర్గాల వారు ఆసక్తిగా చూస్తున్నారు. సెప్టెంబర్ 19న థియేటర్‌ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.