పవన్ ప్రమాణ స్వీకారానికి రెండేళ్లు.. స్వీట్ మెమోరీస్ పంచుకున్న అన్నా!

ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈమె అన్నా కొణిదెల పేరిట తనకంటూ ఒక ప్రత్యేకంగా ఇంస్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఖాతా ద్వారా పలు విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.

Update: 2026-06-12 05:19 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పేరుకే రష్యన్ అయినప్పటికీ హిందూ పద్ధతులను గౌరవిస్తూ..



 


కట్టుబొట్టుతో సాంప్రదాయంగా ఆకట్టుకుంటూ.. అందరి హృదయాలను దోచుకుంటుంది. అటు కుటుంబానికి ఇటు భర్తకు అధిక ప్రాముఖ్యతను ఇస్తూ.. వారి వెన్నంటే నడుస్తూ.. నడిపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈమె అన్నా కొణిదెల పేరిట తనకంటూ ఒక ప్రత్యేకంగా ఇంస్టాగ్రామ్ ఖాతాను ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఖాతా ద్వారా పలు విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.



 


పవన్ అనే నేను.. ప్రమాణ స్వీకారానికి రెండేళ్లు..

ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో తెలియని విషయాలను అభిమానులతో పంచుకుంటూ నిత్యం వార్తలో నిలుస్తున్న ఈమె.. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కి డీసీఎం గా బాధ్యతలు చేపట్టి నేటికీ రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వీడియోని మళ్లీ షేర్ చేస్తూ "పవన్ అనే నేను" అంటూ కొన్ని క్యూట్ మెమోరీస్ ని షేర్ చేసింది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..



 


కొన్నేళ్ల శ్రమకు దక్కిన ఫలితం..

మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన తర్వాత ఆ పార్టీని ప్రజలలో బలోపేతం చేసి రాజకీయాల్లోకి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఈ పార్టీ ద్వారా పోటీ చేసినా పెద్దగా ఫలితం లభించకపోవడంతో చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసి కొంతకాలం కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు . ఇక ప్రజలకు మేలు చేయాలనే తపన పవన్ కళ్యాణ్ లో ఏ మాత్రం తగ్గిపోలేదు. దీంతో జనసేన అనే పార్టీని స్థాపించి నిర్విరామంగా శ్రమించారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు. ఇక ఎట్టకేలకు ఆ ప్రయత్నాలు 2024లో ఫలించాయి.. కూటమి పొత్తుతో పిఠాపురం నుంచి 2024 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి ఎమ్మెల్యేగా.ఘన విజయం సాధించారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం lగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2024 జూన్ 12వ తేదీన ఆ బాధ్యతలను స్వీకరిస్తూ" పవన్ అనే నేను" అంటూ ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారానికి రెండేళ్లు కావడంతో ఆ వీడియోని పంచుకున్నారు అన్నా కొణిదెల.

భర్త కష్టాన్ని అభిమానులతో పంచుకున్న అన్నా కొణిదెల..

జనసేన పార్టీ సింబల్ గ్లాస్ ను చేత పట్టుకొని తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది. అలాగే పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య, కొడుకు అకీరా నందన్ తో కలిసి దిగిన ఫోటోలను అలాగే మెగా ఫ్యామిలీ భారత ప్రధాని మోదీని కలిసినప్పుడు తీసుకున్న ఫోటోలను ఆమె ఇంస్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ఈ ఫోటోలను పంచుకుంటూ తన అభిప్రాయాలను షేర్ చేసింది అన్నా.. "ప్రజలు మీ విజయాన్ని చూస్తున్నారు. అయితే ఈ విజయం వెనుక మీరు పడ్డ సంవత్సరాల శ్రమ చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు

ఆ అలసటను, ఆ అవమానాన్ని, ఆ అనిశ్చితిని, ప్రపంచమంతా మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించిన ఆ పగలు, రాత్రులు, ముఖ్యంగా మిమ్మల్ని అవమానించి ఎగతాళి చేసిన వారిని నేను చూసాను.

భర్త యుద్ధం చేస్తుంటే.. ఒంటరిగా భావించాను..

ఎంతోమంది ఆయనను ప్రశ్నించారు.. ఎగతాళి చేశారు.. రకరకాల పేర్లతో పిలిచారు. అయితే ఆయన బహిరంగంగా యుద్ధాలు చేస్తుండగా.. నేను ఇంట్లో మా పిల్లల కోసం ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తూ...పూర్తిగా ఒంటరిగా ఉన్నట్లు భావించేదాన్ని. నేను కూడా కుప్పకూలిపోవాలనుకున్న రోజులు ఉన్నాయి. భయపడిన రోజులు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి తాను నమ్మిన దానికోసం ఇంకెంత భరించగలడు అని నేను ఆశ్చర్యపోయిన రోజులు కూడా ఉన్నాయి.. అయినా సరే మేము ముందుకు సాగాము. అది సులభం అయినందుకు కాదు.. అది జీవితాన్ని సుఖవంతం చేసినందుకు కూడా కాదు.. కానీ కొంతమంది తమ మనస్సాక్షికి ద్రోహం చేయలేరు కాబట్టి.. బహుశా ఆ విజయం మాకు అంత భావోద్వేగా అనిపించింది.

ఆ క్షణం.. కళ్ళు నీళ్లతో నిండిపోయాయి..

అయితే ఆ ఆనందం రాజకీయంగా కాదు మానవతా దృక్పథంతో మేము ఆ ఆనందాన్ని పొందగలిగాము. సంవత్సరాల తరబడి అనుభవించిన ఆ బాధ ఒక్క క్షణంలో మారిపోయింది. కళ్ళల్లో నీళ్లతో అక్కడ నిలబడిన ఆ క్షణం నాకు ఇంకా గుర్తుంది. నేను ఏడుస్తున్నానని మోడీ జీ కూడా గమనించారు. అవి ఆనందపు, స్వచ్ఛమైన, సంతోషపు కన్నీళ్లు. నిజానికి కొన్నిసార్లు దేవుడు మనుషులను సంవత్సరాల తరబడి అవమానించబడడానికి, పరీక్షించబడడానికి అనుమతిస్తాడు. అయితే కేవలం ప్రపంచం ముందు వారి గౌరవాన్ని తిరిగి ఇవ్వడానికే దేవుడు అలా చేస్తాడు ..మరి ఆ క్షణంలో నాకేం అనిపించిందని ఎవరైనా నన్ను అడిగితే.. కేవలం గర్వం.. వదులుకోవడానికి నిరాకరించిన ఆ వ్యక్తి పట్ల గర్వం.. నిన్ను చూసి చాలా గర్వంగా ఉంది" అంటూ పవన్ కళ్యాణ్ ను ట్యాగ్ చేసి తన మనసులోని భావాలను పంచుకుంది అన్నా కొణిదెల.



Tags:    

Similar News