ఆ ఇద్ద‌రు హీరోల్లా అన్న‌య్య బౌన్స్ బ్యాక్!

హిట్ మెషిన్ అనీల్ రావిపూడి స‌క్సెస్ ట్రాక్ ఎలా? ఉంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇంత వ‌ర‌కూ వైఫ‌ల్య‌మే లేని ద‌ర్శ‌కుడిగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత స్థానంలో కొన‌సాగుతున్నాడు.;

Update: 2026-01-11 11:34 GMT

హిట్ మెషిన్ అనీల్ రావిపూడి స‌క్సెస్ ట్రాక్ ఎలా? ఉంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇంత వ‌ర‌కూ వైఫ‌ల్య‌మే లేని ద‌ర్శ‌కుడిగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత స్థానంలో కొన‌సాగుతున్నాడు. రాజ‌మౌళి పాన్ ఇండియాని దున్న‌తుంటే? అనీల్ రావిపూడి రీజ‌నల్ మార్కెట్ ని ఏల్తున్నాడు. ఆ ర‌కంగా అనీల్ హీరోల పాలిట బంగారు బాతులా మారాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాలను అందించ‌డం అన్న‌ది అనీల్ కు మాత్ర‌మే సాధ్య‌మైంది. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్లు అందించడమే కాక‌, తనతో పనిచేసే నటుల ప్లాపుల‌ పరంపరకు ముగింపు పలుకుతాడనే ప్రత్యేక ఇమేజ్ కూడా అనీల్ పై ఉంది.

గతంలో సరైన హిట్లు లేక ఇబ్బంది ప‌డిన‌ కల్యాణ్ రామ్, రవితేజ లాంటి స్టార్ల‌కు అనీల్ కొత్త ఊపిరి పోసిన ద‌ర్శ‌కుడు. విక్ట‌రీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సైతం `ఎఫ్ 2` విజ‌యంతో అలా బౌన్స్ బ్యాక్ అయిన స్టార్లే.

'ఎఫ్ 2' కంటే ముందు ఇద్ద‌రు స్టార్లు ప్లాప్ ల్లో ఉన్నారు. ఎలాగైనా హిట్ కొట్టాలి అన్న స‌మ‌యంలో? అనీల్ తోడ‌వ్వ డంతో విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌క‌లా మారింది. అలాంటి మ్యాజిక్ వెంకీ కెరీర్ లో రెండ‌వ‌సారి జ‌రిగింది. వెంకటేష్ న‌టించిన `సైంధవ్` ప‌రాజ‌యం చూసిన‌ప్ప‌టికీ  'సంక్రాంతికి వస్తున్నాం' హిట్ తో బౌన్స్ బ్యాక్ అవ్వ‌డ‌మే కాదు వెంకీని ఏకంగా 300 కోట్ల క్ల‌బ్ లో కూర్చోబెట్టాడు.

వెంకీ ఇమేజ్ ని నాలుగింత‌లు రెట్టింపు చేసిన చిత్ర‌మది. ప్రస్తుతం అందరి కళ్లు మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి విడుదల 'మన శంకర్ వర ప్రసాద్ గారు' పైనే ఉన్నాయి. అన్న‌య్య గ‌త చిత్రం 'భోళా శంక‌ర్ 'డిజాస్ట‌ర్ అయింది. దీంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశ‌లో కూరుకుపోయారు. ప్ర‌తిగా చిరంజీవి సైతం తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కున్నారు. దీంతో అనీల్ సినిమా అయిన వ‌ర‌ప్ర‌సాద్ తో మ‌ళ్లీ ఫాంలో కి వ‌చ్చేస్తారు? అన్న ధీమా స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ వుతోంది. 'విశ్వంభ‌ర‌'తో పున‌రాగ‌మ‌నం ద‌క్కుతోంద‌ని భావించారు గానీ సినిమా విడుద‌ల వాయిదా ప‌డుతోన్న నేప‌థ్యంలో అనీల్ చిత్రంపైనే ఆశ‌ల‌న్నీ. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్లు అనీల్ కు కొట్టిన పిండి.

ఆద్యంతం హిలేరియ‌స్ ఎంట‌ర్ టైన‌ర్ అని ముందే చెప్పేసారు. చిరంజీవి పాత సినిమాల స్పూర్తితోనే క్యారెక్ట‌ర్ ను అల్లాడు. కాబ‌ట్టి వైవిథ్యం అనేది ఉండ‌దు. మ‌ళ్లీ 25 ఏళ్ల క్రితం నాటి చిరంజీవి పాత పాత్ర‌ల ఆధారంగా చిరు పాత్ర‌ను త‌న‌దైన శైలిలో డిజైన్ చూపిస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో అనీల్ స‌క్సెస్ కే అవ‌కాశాలు ఎ క్కువ‌గా ఉన్నాయి. క‌థ విష‌యంలో నేల విడిచి సాము చేసే ద‌ర్శ‌కుడు కాదు కాబ‌ట్టి మెగా అభిమానులంతా ధీమాగా ఉండొచ్చు. ఆ ర‌క‌మైన కాన్పిడెన్స్ అభిమానుల్లోనూ క‌నిపిస్తోంది.

Tags:    

Similar News