తిరుపతిలో అమర్దీప్ సందడి.. 'సుమతీ శతకం' ట్రైలర్‌తో పాజిటివ్ బజ్!
ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా వస్తున్న 'సుమతీ శతకం' సినిమాపై ఇండస్ట్రీలో మంచి చర్చ సాగుతోంది.;
టాలీవుడ్‌లో ఇప్పుడు చిన్న సినిమాల హవా నడుస్తోంది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్న రోజులివి. ఈ క్రమంలోనే బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా వస్తున్న 'సుమతీ శతకం' సినిమాపై ఇండస్ట్రీలో మంచి చర్చ సాగుతోంది. ఇప్పటికే సాంగ్స్, టీజర్‌తో పాజిటివ్ వైబ్ క్రియేట్ చేసిన ఈ టీమ్, ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచింది. ముఖ్యంగా రాయలసీమ ఏరియాలో ఈ సినిమా టీమ్ చేస్తున్న హడావుడి మామూలుగా లేదు.
రీసెంట్ గా తిరుపతిలోని శ్రీరామ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. వేల సంఖ్యలో స్టూడెంట్స్ మధ్య అమర్దీప్ సందడి చేయడంతో అక్కడ వాతావరణం అంతా ఫుల్ జోష్‌గా మారిపోయింది. తన కెరీర్ మొదట్లో 'రామ' అనే సినిమాతో ప్రయాణం మొదలైందని, మళ్ళీ అదే పేరున్న కాలేజీలో తన సినిమా ట్రైలర్ లాంచ్ అవ్వడం ఒక మంచి సెంటిమెంట్ అని అమర్దీప్ సంతోషం వ్యక్తం చేశారు. షూటింగ్ సమయంలో చేతికి గాయమైనా లెక్కచేయకుండా కష్టపడి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు.
అసలు ఈ సినిమాపై హైప్ పెరగడానికి మెయిన్ రీజన్.. 'సుమతీ శతకం' డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ తీసుకోవడమే. ఫిబ్రవరి 6న ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మైత్రి లాంటి పెద్ద సంస్థ వెనకుందంటే కంటెంట్ లో ఏదో ఒక వెరైటీ పాయింట్ ఉండే ఉంటుందని సినీ ప్రియులు భావిస్తున్నారు. ట్రైలర్ లో కనిపించిన విజువల్స్ చూస్తుంటే ఇది కేవలం లవ్ స్టోరీ మాత్రమే కాకుండా, కామెడీ, సస్పెన్స్, డివోషనల్ ఎలిమెంట్స్ కలిసిన ఒక కంప్లీట్ ప్యాకేజీలా అనిపిస్తోంది.
దర్శకుడు ఎంఎం నాయుడు ఈ చిత్రాన్ని ఒక విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కించారు. హీరో అమర్దీప్ పెర్ఫార్మెన్స్ తో పాటు టేస్టీ తేజ కామెడీ, మహేష్ విట్టా సర్పంచ్ క్యారెక్టర్ సినిమాలో మేజర్ హైలైట్స్ కానున్నాయి. హీరోయిన్ సైలీ చౌదరి తన అందం, అభినయంతో ఆకట్టుకోబోతోంది. ప్రొడ్యూసర్ సాయి సుధాకర్ కొమ్మాలపాటి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. రాయలసీమలోని కర్నూలు, అనంతపూర్, కడప లాంటి ప్రాంతాల్లో ఈ సినిమా టీమ్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే బి, సి సెంటర్లలో మంచి ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి.
ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో అమర్దీప్ మాట్లాడుతూ.. "ఒక్క ఛాన్స్ ఇచ్చి థియేటర్లో సినిమా చూడండి, కచ్చితంగా నచ్చుతుంది" అని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ గా తన కాలేజీ రోజులను గుర్తు చేసుకుంటూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రానికి సుభాష్ ఆనంద్ మ్యూజిక్ అందించారు.
సాంగ్స్ ఇప్పటికే చార్ట్ బస్టర్స్ గా నిలవడంతో సినిమాకు మంచి బిజినెస్ కూడా జరుగుతున్నట్లు మేకర్స్ తెలిపారు. మొత్తానికి 'సుమతీ శతకం' టీమ్ తమ ట్రైలర్ తో బాక్సాఫీస్ దగ్గర సౌండ్ చేస్తోంది. ఫిబ్రవరి 6న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ అమర్దీప్ కెరీర్ కు ఎలాంటి టర్నింగ్ పాయింట్ ఇస్తుందో చూడాలి. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.