భార్యతో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసిన టాలీవుడ్ నటుడు
అల్లు శిరీష్ పోస్ట్ పై సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్.. పలువురు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
మెగా కాంపౌండ్ యంగ్ హీరో అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక ఎమోషనల్ అండ్ ఫన్నీ పోస్ట్ ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో తెగ వైరల్ అవుతోంది. ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త నయనిక రెడ్డిని వివాహం చేసుకుని ఒక ఇంటివాడైన శిరీష్.. తాజాగా తన భార్యతో కలిసి ఉన్న ఒక మధురమైన జ్ఞాపకాన్ని అభిమానులతో షేర్ చేసారు. తమ వైవాహిక జీవితంలోని సరికొత్త అప్‌డేట్‌తో పాటు.. అసలు వీరిద్దరి ప్రయాణం ఎక్కడ మొదలైందనే ఆసక్తికరమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా రివీల్ చేశారు.
సరిగ్గా ఏడాది క్రితం అంటే 29 మే 2025న తన పుట్టినరోజు ముందరి సాయంత్రం తమ ఇరు కుటుంబాల మధ్య `పెళ్లి చూపులు` కార్యక్రమం జరిగిందని అల్లు శిరీష్ గుర్తుచేసుకున్నారు. రెండు కుటుంబాల పెద్దలు ఒకచోట చేరి తాము పెళ్లి చేసుకోవాలనే నిర్ణయాన్ని ఎంతో సంతోషంగా ఆశీర్వదించారని తెలిపారు. ఆ క్షణం నుండి గడిచిన ఈ ఏడాది కాలం ఎంతో మ్యాజికల్‌గా చాలా వేగంగా గడిచిపోయిందని.. ప్రస్తుతం తామిద్దరం సంతోషకరమైన వైవాహిక బంధాన్ని ఆస్వాదిస్తూ.. రీసెంట్‌గా ఇద్దరం కలిసి ఒక `జాయింట్ బ్యాంక్ అకౌంట్` కూడా ఓపెన్ చేశామంటూ శిరీష్ సరదాగా రాసుకొచ్చారు.
అల్లు శిరీష్ పోస్ట్ పై సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్.. పలువురు సెలబ్రిటీలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. కామెంట్ సెక్షన్ లో లవ్ సింబల్స్, ఎమోజీలతో తమ అభినందనలు తెలియజేస్తున్నారు. శిరీష్- నైనిక దంపతులు నిండు నూరేళ్ల పాటు ఇలాగే సంతోషంగా కలిసి ఉండాలని నెటిజన్లు ఆకాంక్షించగా.. జూన్ మొదటి వారంలో రాబోతున్న శిరీష్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులు అప్పుడే సోషల్ మీడియా వేదికగా `అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే అన్నా` అంటూ బర్త్ డే విషెస్ చెప్పడం ప్రారంభించారు.
అల్లు శిరీష్, నయనిక రెడ్డిల వివాహ వేడుక ఈ ఏడాది మార్చి నెలలో అత్యంత వైభవంగా సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో జరిగిన సంగతి తెలిసిందే. టాలీవుడ్‌లో ఎప్పుడూ కాస్త లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ పర్సనల్ లైఫ్‌కి ఎక్కువ ప్రైవసీ ఇచ్చే శిరీష్.. ఇప్పుడు ఇలా ఓపెన్ గా తన భార్యపై ఉన్న ప్రేమానుబంధాన్ని.. లైఫ్ జర్నీని షేర్ చేసుకోవడంతో మెగా అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ జాయింట్ అకౌంట్ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర డిజిటల్ వేదికలపై ట్రెండింగ్‌లో నిలిచింది.