చిరంజీవిలాగే బన్నీ కూడా 'లీగల్' వార్నింగ్ ఇస్తారా?
దేశవ్యాప్తంగా 'పుష్ప' ఫీవర్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నార్త్ నుంచి సౌత్ వరకు అల్లు అర్జున్ మేనియా మామూలుగా లేదు;
దేశవ్యాప్తంగా 'పుష్ప' ఫీవర్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నార్త్ నుంచి సౌత్ వరకు అల్లు అర్జున్ మేనియా మామూలుగా లేదు. ఈ క్రేజ్‌ను అభిమానం అనాలా లేక వ్యాపారం అనాలా తెలియదు కానీ, ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఏకంగా "అల్లు అర్జున్ కా ఫ్యాన్స్ ధాబా" పేరుతో ఒక రెస్టారెంట్ వెలసింది. అక్కడ అల్లు అర్జున్ ఫోటోలు, 'పుష్ప' సినిమా పోస్టర్లతో హడావుడి చేస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించడానికి బన్నీ క్రేజ్‌ను వాడుకుంటున్నారు.
అయితే, ఇప్పుడు ఇక్కడో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సరిగ్గా ఇలాగే చిరంజీవి పేరుతో బిజినెస్ చేసిన వారికి ఇటీవల లీగల్ నోటీసులు వెళ్లాయి. మరి ఇప్పుడు అల్లు అర్జున్ టీమ్ కూడా అదే బాటలో నడుస్తుందా? బన్నీ కూడా సీరియస్ అవుతారా? అనే కోణంలో ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి తన పర్సనాలిటీ రైట్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా వ్యవహరించారు. ఎవరైనా తప్పుగా వాడుకునే అవకాశం ఉందని ముందు జాగ్రత్తగా తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటో, వాయిస్ వాడి వ్యాపారం చేసే దాదాపు 60 సంస్థలకు కోర్టు ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. నల్లగండ్లలోని 'చిరంజీవి ధాబా'కు కూడా నోటీసులు వచ్చాయి. అయితే, అది ఫ్యాన్స్ నడుపుతున్నదని, క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని తెలిసి చిరు పెద్ద మనసుతో వదిలేశారు. కానీ, అల్లు అర్జున్ ధాబా విషయంలో బన్నీ టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తికరం.
చిరంజీవి లాగే బన్నీ కూడా తన బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కాకూడదని భావిస్తే, కచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. రాయ్‌పూర్‌లో పెట్టిన ఈ ధాబాలో కేవలం పేరు మాత్రమే కాదు, ఇంటీరియర్ మొత్తం అల్లు అర్జున్ సినిమాలతో నింపేశారు. ఇది చూస్తుంటే, కేవలం అభిమానంతో పెట్టినట్లు కాకుండా, 'పుష్ప 2' రిలీజ్ టైమ్‌లో ఉన్న హైప్‌ను వాడుకుని డబ్బు సంపాదించాలనే స్ట్రాటజీలా కూడా కనిపిస్తోంది.
ఇలా సెలబ్రిటీల పేర్లను కమర్షియల్ ప్రయోజనాలకు వాడుకోవడం చట్టరీత్యా నేరం. ఒకవేళ అక్కడ ఫుడ్ క్వాలిటీ బాగోలేకపోయినా, ఏదైనా గొడవ జరిగినా.. అది నేరుగా అల్లు అర్జున్ ఇమేజ్‌కే దెబ్బ తగులుతుంది. అందుకే స్టార్ హీరోలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రస్తుతానికి అల్లు అర్జున్ అట్లీ సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ ధాబా విషయం ఆయన దృష్టికి వెళ్లిందో లేదో తెలియదు.
కానీ, గీతా ఆర్ట్స్ కాంపౌండ్, అల్లు అరవింద్ లాంటి సీనియర్లు కాపీరైట్స్, బ్రాండ్ వాల్యూ విషయంలో చాలా పక్కాగా ఉంటారు. గతంలో జరిగినట్లుగానే, రేపు బన్నీ పేరుతో ఎవరైనా చీప్ లిక్కర్ అమ్మినా, నాణ్యత లేని ప్రోడక్ట్స్ అమ్మినా అది పెద్ద సమస్య అవుతుంది. కాబట్టి, ముందస్తు చర్యగా బన్నీ టీమ్ కూడా వార్నింగ్ ఇచ్చే ఛాన్స్ లేకపోలేదు. లేదా చిరంజీవి గారిలాగే, అది నిజమైన అభిమానంతో మంచి క్వాలిటీతో ఉందొ లేదో అని ఎంక్వైరీ చేసి నిర్ణయం తీసుకోవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో.