అల్లు అర్జున్ - ఎన్టీఆర్ కోసం మల్టీస్టారర్ కథ రెడీ చేసిన తమిళ్ డైరెక్టర్...

ఈ ఇద్దరు స్టార్ హీరోలకు పాన్ ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉండడం వల్ల వీళ్ళతో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

Update: 2026-10-15 06:37 GMT

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతు ముందుకు సాగుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోలతో మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి దర్శకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. తమ అభిమాన హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూడడానికి ప్రేక్షకులు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండడం విశేషం. 'ఆర్ఆర్ఆర్' సినిమా ఈ ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. మొత్తానికైతే స్టార్ హీరోలందరు మల్టీస్టారర్ సినిమాల వైపు అడుగులు వేస్తుండడం విశేషం... జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత 'వార్ 2' సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు... ఆ మూవీ ఆశించిన మేరకు ఫలితాన్ని ఇవ్వకపోయిన కూడా ఎన్టీఆర్ పాత్రకి మంచి గుర్తింపైతే వచ్చింది...

అల్లు అర్జున్

'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా రికార్డులను బ్రేక్ చేసిన అల్లు అర్జున్ 'రాకా తో మరోసారి ఇండస్ట్రీ రికార్డులను తుడిచిపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు. పుష్ప మూవీ భారీ హిట్ అవ్వడంతో అల్లు అర్జున్ ఆలోచన శైలి మారిపోయింది. కథల విషయంలో పూర్తి క్లారిటీ తో ఉంటున్నాడు. ఆయన ఎంచుకుంటున్న సబ్జెక్టులు సైతం ప్రేక్షకుడిలో ఒక క్యూరియాసిటీ రేకెత్తిస్తున్నాయి.

ఎన్టీఆర్

ఎన్టీఆర్ సైతం 'దేవర' మూవీతో పాన్ ఇండియాలో తమ సత్తా చాటుకున్నాడు. ప్రస్తుతం 'డ్రాగన్' సినిమాని రంగంలోకి దింపుతున్నాడు. ఈ మూవీతో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అవ్వడం పక్కా అంటూ ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

అల్లు అర్జున్ - ఎన్టీఆర్ ను కలిపే డైరెక్టర్...

ఈ ఇద్దరు స్టార్ హీరోలకు పాన్ ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉండడం వల్ల వీళ్ళతో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న 'నెల్సన్' సైతం వీళ్ళిద్దరి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఒక కథనైతే రెడీ చేస్తున్నాడట. డార్క్ కామెడీ యాక్షన్ మూడ్ లో సినిమాలను తీసుకెళ్లగలిగే కెపాసిటీ ఉన్న నెల్సన్ ఇప్పటి వరకు చేసిన సినిమాలు వైవిధ్యాన్ని సృష్టించినవే కావడం విశేషం... అందుకే ఈయన వీళ్లిద్దరిని కలిపి సినిమా చేయాలని భావిస్తున్నారట. తను అనుకున్నట్టుగానే ఈ ఇద్దరు హీరోలకు తన కథను చెప్పి ఒప్పిస్తాడా? వీళ్ల ఇమేజ్ ను బ్యాలెన్స్ చేస్తూ సినిమా చేయగలిగే కెపాసిటీ నెల్సన్ కి ఉందా?

వీళ్ళిద్దరిని కలపాలనే ఆలోచన మాత్రం చాలా గొప్పదనే చెప్పాలి. ఒకవేళ వీళ్ళిద్దరితో సినిమా చేస్తే మాత్రం ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ అవ్వడం పక్క అంటూ మరికొంతమంది సినీ విశ్లేషకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ స్టార్ హీరోలు కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సినిమాని పట్టలెక్కిస్తే దానిని పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోతే మాత్రం నెల్సన్ తీవ్రమైన విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ముందుకు సాగాలి...నెల్సన్ రజినీకాంత్ తో చేసిన 'జైలర్ 2' మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నెల్సన్ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి ఈ మూవీ రిజల్ట్ కీలకం గా మారబోతోంది...

Tags:    

Similar News