'ఈసారి యాక్టర్ సెల్ఫిష్ నెస్ తో చేస్తున్నా'.. సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సినిమా ఎంపిక విషయంలో తన ఆలోచనల గురించి సందీప్ కిషన్ మాట్లాడారు. గత మూడు నెలలుగా నటుడిగా తన స్వార్థం లేకుండా సినిమాలు చేశానని తెలిపారు.
కొత్త కథలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.. ఇప్పుడు 'కరికాల' మూవీ చేస్తున్నారు. 'శంబాల' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యుగంధర్ ముని ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా పూజ సెర్మనీ జరగ్గా.. సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గత మూడు నెలలుగా తన రోల్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా సినిమాలు చేశానని.. కానీ ఇప్పుడు యాక్టర్ సెల్ఫిష్ నెస్ పై ఫోకస్ పెట్టి చేస్తున్నానని చెప్పారు.
సినిమా ఎంపిక విషయంలో తన ఆలోచనల గురించి సందీప్ కిషన్ మాట్లాడారు. గత మూడు నెలలుగా నటుడిగా తన స్వార్థం లేకుండా సినిమాలు చేశానని తెలిపారు. సినిమాలో తన పాత్ర ఏం చేయగలదు, ప్రేక్షకులు తన నుంచి ఏం ఆశిస్తారనే లెక్కలు వేసుకోకుండా పనిచేశానని చెప్పారు. అయితే ఇప్పుడు నటుడిగా తనను తాను చూపించుకోవాలనే ఉద్దేశంతో 'కరికాల' చేస్తున్నట్లు వెల్లడించారు.
'కరికాల' కథ తనకు బాగా నచ్చిందని సందీప్ కిషన్ చెప్పారు. దర్శకుడు యుగంధర్ ముని, నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు ఆ ప్రాజెక్టుతో తనను అప్రోచ్ అయ్యారని తెలిపారు. కథను ఒక్క సెకెండ్ కూడా బోర్ కొట్టకుండా చెప్పారని అన్నారు. ఆ సినిమా రెండు పార్టులుగా రూపొందుతుందని, దాదాపు 140 రోజుల పాటు షూటింగ్ చేయాల్సి ఉంటుందని వివరించారు.
ఇంత పెద్ద మూవీ చేస్తున్నప్పుడు కొన్ని డౌట్స్ ఉంటాయని అన్న సందీప్ కిషన్.. సినిమాలో సింహాలు, పిల్లలు, పాత కాలానికి సంబంధించిన అంశాలు ఉన్నాయని చెప్పారు. ఇలాంటి సీన్స్ ను స్క్రీన్ పై ఎలా చూపిస్తారనే విషయంలో మొదట కొంత టెన్షన్ పడినట్లు వెల్లడించారు. అయితే సినిమా ఓకే అయినప్పటి నుంచి మూవీ టీమ్ మొత్తం అదే పనిలో ఉందని తెలిపారు. ప్రిపరేషన్ కోసం కూడా ఐదు నెలలుగా తొమ్మిది మందితో కూడిన బృందం పనిచేస్తోందని చెప్పారు.
మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు ప్యాషినేట్ నిర్మాతలని సందీప్ కిషన్ ప్రశంసించారు. ఖర్చు గురించి మాత్రమే ఆలోచించకుండా సినిమా ఎలా తీయాలి, సెట్స్ ఎలా వేయాలనే విషయాలపై దృష్టి పెడుతున్నారని తెలిపారు. బడ్జెట్ గురించి కాకుండా సినిమా క్వాలిటీ గురించి ఆలోచించే నిర్మాతలు ఉన్నప్పుడే కొత్త తరహా చిత్రాలు వస్తాయని, కొత్త ఆర్టిస్టులకు ఛాన్సులు వస్తాయని చెప్పుకొచ్చారు.
'శంబాల' సినిమా బాగుండాలనే ఉద్దేశంతోనే తాను ఆ చిత్రాన్ని ప్రమోట్ చేశానని సందీప్ కిషన్ గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా తర్వాతే 'కరికాల' టీమ్ తనను కాంటాక్స్ చెప్పారు. ఆది సాయి కుమార్ కు థ్యాంక్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వల్లే మంచి దర్శక నిర్మాతలతో పరిచయం ఏర్పడిందని వెల్లడించారు. మనం మంచి ఉద్దేశంతో ఒక పని చేస్తే ఫలితం కూడా మంచిగానే ఉంటుందని అన్నారు.
సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల అందరినీ ఆశ్చర్యపరిచేలా సాంగ్స్ అందించారని సందీప్ కిషన్ చెప్పారు. సినిమాలోని పాటలు హిట్ అవుతాయని నమ్మకం వ్యక్తం చేశారు. హీరోయిన్లు సాక్షి, గాయత్రితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. కేథరిన్ థ్రెసా గురించి సరదాగా మాట్లాడుతూ.. ఆమెను చూస్తే అందరికీ భయమేనని నవ్వుతూ చెప్పారు. కచ్చితంగా సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని అంచనా వేశారు.