అర్జున్ నే పంచాయితీ ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చారు.. ఎవర్రా మీరంతా?
ఏఐ వచ్చాక అసాధ్యమంటూ ఏదీ లేదు. అన్నింటిని అది మాయ చేస్తోంది. నిజమని నమ్మిస్తోంది.;
ఏఐ వచ్చాక అసాధ్యమంటూ ఏదీ లేదు. అన్నింటిని అది మాయ చేస్తోంది. నిజమని నమ్మిస్తోంది. ఏఐతో చేసే పనులు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు తెలంగాణలో పంచాయితీ ఎన్నికల సందడి సాగుతోంది. ఇందులో ఇప్పుడు తమ ఫేవరెట్ యాక్టర్ ను కూడా ఫ్యాన్స్ దింపేశారు. పంచాయితీ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు అల్లు అర్జున్ పాల్గొన్న పోస్టర్ లు వైరల్ అవుతున్నాయి.
మెదక్ జిల్లాలో స్తానిక సంస్థల ఎన్నికల ప్రచారం సరికొత్త మలుపు తీసుకుంది. ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా ఓ పంచాయితీ ఎన్నికల అభ్యర్థి తరుఫున ప్రచారం చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ఒక చిత్రం హల్ చల్ చేసింది. ఫొటోను క్రియేట్ చేసి వైరల్ చేశారు.
అల్లు అర్జున్ పంచాయితీ పోరుకు ఎందుకొస్తారు?
సాధారణంగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో స్టార్ హీరోల సందడి కనిపిస్తుంది కానీ.. ఓ పంచాయితీ ఎన్నికల ప్రచారానికి అల్లు అర్జున్ లాంటి అగ్రహీరో రావడం ఏమిటనే అనుమానం జిల్లా ప్రజల్లో ముఖ్యంగా అభిమానుల్లో తలెత్తింది. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇది నిజంగా అల్లు అర్జున్ పాల్గొన్న ప్రచారం కాదు.
‘కత్తెర’ గుర్తుకు ఓటు వేయాలని ఏఐ ప్రచారం
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో మంగళవారం నుంచి ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ స్థానిక సంస్థల అభ్యర్థి తన ఎన్నికల గుర్తు అయిన కత్తెర గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహకారంతో ఈ ఫొటోను రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఫొటోలో అల్లు అర్జున్ ఆ అభ్యర్థి తరుఫున ప్రచారం చేస్తున్నట్టుగా కనిపిస్తుండడంతో విషయం తెలియని జనాలు ఆశ్చర్యపోయారు. అల్లు అర్జున్ పంచాయితీ ఎన్నికల ప్రచారానికి తీసుకొచ్చార? ఎవర్రా మీరంతా అంటూ కొంతమంది సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
ఏఐ మాయాజాలం.. సాంకేతికత ఎన్నికల్లో వినియోగం
స్థానిక ఎన్నికల ప్రచారంలో కూడా ఏఐ టెక్నాలజీని వాడుకోవడం చూస్తుంటే.. సాంకేతికత ఏ విధంగా పంచార హద్దులను చెరిపేస్తుందో అర్థమవుతోంది. ఈ అల్లు అర్జున్ ఏఐ ప్రచారం చిత్రం ప్రస్తుతం మెదక్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.