త్వరలో ఏఎన్ఆర్ రాక.. నాగార్జున ఏమన్నారంటే..?

త్వరలో ఏఎన్ఆర్ మళ్ళీ రాబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించగా.. తాజాగా ఈ విషయంపై నాగార్జున స్పందించారు.;

Update: 2025-12-17 11:03 GMT

సాధారణంగా ఎక్కడైనా సరే ఒక జంట వివాహం చేసుకుంది అంటే.. ఇక వారసుడిని ఎప్పుడు ఇస్తారు అని చుట్టుపక్కల వారు, కుటుంబ సభ్యులు అడుగుతూ ఉంటారు. అయితే సెలబ్రిటీలు ఇందుకు అతీతం కాదు అని చెప్పాలి. అయితే సామాన్య ప్రజల గురించి కాస్త పక్కన పెడితే..సెలబ్రిటీలు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వీరికి సంబంధించిన వార్తలు ఇట్టే వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఒక్కొక్కసారి అందులో నిజం లేకపోయినా పుకార్లు మాత్రం చాప కింద నీరులా పాకుతూ ఉంటాయనడంలో సందేహం లేదు. దీనికి తోడు ఒక జంట గర్భం దాలుస్తున్నారు అంటే ఆ కుటుంబంలో చనిపోయిన వారు మళ్ళీ వీరి కడుపున పుడతారు అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అనడంలో సందేహం లేదు. సరిగ్గా ఇప్పుడు అదే వార్త ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది.

త్వరలో ఏఎన్ఆర్ మళ్ళీ రాబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించగా.. తాజాగా ఈ విషయంపై నాగార్జున స్పందించారు. అసలు విషయంలోకి వెళ్తే.. అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య సమంతను వివాహం చేసుకున్నప్పుడు.. సమంత గర్భం దాల్చింది అంటూ అప్పట్లో వార్తలు బాగా వినిపించాయి. అయితే అందులో నిజం లేకపోయింది. పైగా పెళ్లైన నాలుగేళ్లకే సమంత నాగచైతన్య నుంచి విడిపోయింది. ఇక గత ఏడాది శోభిత ధూళిపాళ్లతో నాగచైతన్య రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ గర్భం వార్తలు నాగచైతన్య విషయంలో కాదు ఆయన తమ్ముడు ప్రముఖ హీరో అఖిల్ విషయంలో ఊపందుకున్నాయి.

అక్కినేని అఖిల్ గత ఏడాది సాంప్రదాయ హిందూ పద్ధతిలో జైనాబ్ తో ఏడు అడుగులు వేసిన విషయం తెలిసిందే. అయితే గత రెండు నెలల నుండి ఈ జంట తమ మొదటి బిడ్డను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు అని.. త్వరలోనే ఏఎన్ఆర్ మళ్ళీ రాబోతున్నారు అంటూ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నిజానికి ఇలాంటి రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించడంతో తాజాగా ఇదే ప్రశ్న నాగార్జునకు ఎదురయింది.

అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ఆయన నగరంలో జరిగిన ఒక ఆరోగ్య కార్యక్రమంలో పాల్గొనగా.. ఒక మీడియా ప్రతినిధి మాట్లాడుతూ.." త్వరలో మీరు తాత కాబోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉంది?"అని ప్రశ్నించగా.. ఆయన మొదట షాక్ అయ్యి.. ఆ తర్వాత నవ్వి.. "ఇలాంటి శుభవార్తలు ఏవైనా ఉంటే నేనే స్వయంగా ప్రకటిస్తాను" అంటూ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా త్వరలో ఏఎన్ఆర్ రాబోతున్నారని.. అఖిల్ - జైనాబ్ జంట తమ తొలి బిడ్డకు ఆహ్వానం పలకబోతోంది అంటూ వస్తున్న వార్తలకు ఒక్క మాటతో క్లారిటీ ఇచ్చారు నాగార్జున.

.

Tags:    

Similar News