అజిత్ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'.. తెలుగు టీజర్ చూశారా?

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.;

Update: 2025-04-07 07:43 GMT

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్.. ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రీసెంట్ గా పట్టుదల సినిమాతో థియేటర్లలో సందడి చేసిన ఆయన.. అనుకున్నంత స్థాయిలో హిట్ అందుకోలేకపోయారు. దీంతో ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీపై భారీ హోప్స్ పెట్టుకున్నారు.

టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. సీనియర్ హీరోయిన్ త్రిష ఫిమేల్ లీడ్ రోల్ పోషించగా, జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తవ్వగా.. ఏప్రిల్ 10న తెలుగు, తమిళ, హిందీలో రిలీజ్ కానుందీ మూవీ.

అయితే సంక్రాంతికి సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మేకర్స్ సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. సినిమా నుంచి టీజర్ తోపాటు సాంగ్స్ ను విడుదల చేశారు. రీసెంట్ గా తమిళ మూవీ వెర్షన్ ట్రైలర్ ను కూడా తీసుకొచ్చారు మేకర్స్.

ఇప్పుడు తాజాగా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రెండింగ్ మ్యూజిక్ తో గ్లింప్స్ స్టార్ట్ అవ్వగా.. అజిత్ క్రేజీగా కనిపించారు. ఆ తర్వాత వివిధ లుక్స్ లో ఆయన సందడి చేశారు. సినిమాలో విభిన్న పాత్రల్లో ఆయన కనిపించనున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది. త్రిష ఎవర్ గ్రీన్ గా ఉండగా.. క్యాస్టింగ్ మాత్రం భారీగా ఉందనే చెప్పాలి.

ట్రైలర్ లో అజిత్ డైలాగ్స్ కొన్ని ఆకట్టుకుంటున్నాయి. 'చేతులు ఉంటాయి.. ముక్కు ఉంటుంది.. కళ్లు ఉంటాయి.. కానీ ఊపిరే..' 'హింస నా కొడుకు కోసం వదిలిపెట్టా.. కానీ నా కొడుక్కే కష్టం వస్తే ఊరుకోను' అంటూ చెప్పిన అజిత్ డైలాగ్స్ కొన్ని క్రేజీగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కానీ ట్రైలర్ చూస్తుంటే రొటీన్ కమర్షియల్ యాంగిల్ కనిపిస్తుందని నెటిజన్లు చెబుతున్నారు. రెగ్యులర్ యాక్షన్ డోస్ అని అంటున్నారు. అక్కడకక్కడ యాక్షన్ సీన్స్ ఓకే కానీ ఓవరాల్ గా అంతగా లేదని కామెంట్లు పెడుతున్నారు. ట్రైలర్ లో వచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓల్డ్ ఫార్మాట్ లో ఉందని అంటున్నారు. మరి గుడ్ బ్యాడ్ అగ్లీ తెలుగులో ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News