పిక్ టాక్ : బ్లాక్ అండ్‌ వైట్ బికినీ షో

రామ్‌ చరణ్ కి జోడీగా చిరుత సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ

Update: 2024-05-22 13:30 GMT

రామ్‌ చరణ్ కి జోడీగా చిరుత సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. టాలీవుడ్‌ లో ఈ అమ్మడికి లక్‌ కలిసి రాలేదు. రామ్‌ చరణ్ తో నటించిన మొదటి సినిమా హిట్ అయినా కూడా టాలీవుడ్‌ లో మరిన్ని ఆఫర్లు దక్కించుకోవడంలో ఈ అమ్మడు విఫలం అయ్యింది.

ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా ఏళ్లు అయినా కూడా ఇప్పటి వరకు ఈ అమ్మడు ఏదో ఒక సినిమా లేదా షో ల్లో కనిపిస్తూనే ఉంది. తాజాగా నేహా శర్మ యొక్క సోదరి ఐషా శర్మ సోషల్‌ మీడియా ద్వారా సందడి చేస్తుంది. రెగ్యులర్‌ గా ఈమె షేర్‌ చేస్తున్న అందాల ఆరబోత ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి.

ఐషా శర్మ అందాల విందుకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా మరోసారి బికినీ షో తో ఐషా అలరించింది. ఈసారి బ్లాక్ అండ్‌ వైట్‌ ఫోటోలో కూడా కళ్లు మిరుమిట్లు గొలిపే విధంగా అందాల విందు చేసిన ఈ అమ్మడికి ఎంతో మంది అభిమానులు అవుతున్నారు.

ఐషా శర్మ ఇప్పటి వరకు హీరోయిన్‌ గా పలు ఆఫర్లు వచ్చినా కూడా తిరస్కరించిందని టాక్ వినిపిస్తుంది. ఒక మంచి కథ మరియు మంచి హీరో తో నటించడం కోసం ఈ అమ్మడు వెయిట్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ అమ్మడు హీరోయిన్ గా బిజీ అవ్వడం ఖాయంగా తెలుస్తోంది.

అక్కకు ఏ మాత్రం తక్కువ కాకుండా అందాల విందు చేస్తున్న ఐషా శర్మ ముందు ముందు అక్క మాదిరిగానే హీరోయిన్‌ గా వరుసగా సినిమాల్లో నటించడం ఖాయం అంటూ కొందరు ఈ ఫోటోలు చూసిన వారు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఐషా ఇలా సోషల్‌ మీడియాలో కాకుండా సినిమాల్లో ఎప్పుడు బిజీ అయ్యి తన అందాలను చూపిస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News