యానిమల్ డైరెక్టర్ దృష్టిలో పడ్డ యువ హీరో..!
సుమంత్ ప్రభాస్ టాలెంట్ ని గుర్తించిన సందీప్ వంగ అతని ప్రొడక్షన్ లో సినిమా హీరోగా ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది.;
యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు తన ప్రొడక్షన్ లో సినిమా చేయాలని అనుకుంటున్నాడట. తన సొంత నిర్మాణంలో సందీప్ వంగ సినిమా ఒకటి డిస్కషన్ లో ఉంది. ఈ సినిమాలో హీరోగా యువ టాలెంటెడ్ హీరో సుమంత్ ప్రభాస్ ని ఫిక్స్ చేశారట. సుమంత్ ప్రభాస్ యూట్యూబ్ సాంగ్స్ తో పరిచయమై మేం ఫేమస్ సినిమాతో డైరెక్టర్ కం హీరోగా అదరగొట్టాడు. ఇక నెక్స్ట్ గోదారి గట్టుపైన సినిమాతో వస్తున్నాడు.
సందీప్ సినిమా అంటే ఒక బ్రాండ్.. తీసిన 3 సినిమాలతోనే..
సుమంత్ ప్రభాస్ టాలెంట్ ని గుర్తించిన సందీప్ వంగ అతని ప్రొడక్షన్ లో సినిమా హీరోగా ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా ఒక కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తాడని టాక్. సందీప్ సినిమా అంటే ఒక బ్రాండ్ లా తీసిన 3 సినిమాలతోనే ఒక క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక అతని ప్రొడక్షన్ లో సినిమా అంటే మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. ముఖ్యంగా సందీప్ నిర్మాతగా ఎంత ఇంపాక్ట్ చూపిస్తాడు అన్నది చర్చిస్తున్నారు.
సుమంత్ ప్రభాస్ హీరోగా సందీప్ వంగ నిర్మాణంలో సినిమా వస్తుంది. ఐతే ఈ సినిమా కూడా సందీప్ డైరెక్ట్ చేసే సినిమాల్లా ఉంటుందా లేదా యువ టీం తో కొత్త కథలతో వస్తారా అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సుమంత్ ప్రభాస్ సందీప్ దృష్టిలో పడటం అతని కెరీర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. సుమంత్ ప్రభాస్ తో ఎలాగు సినిమా చేస్తున్నాడు కాబట్టి ప్రభాస్ తో సందీప్ వంగ చేస్తున్న స్పిరిట్ లో కూడా అతనికి ఏదైనా ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.
ప్రభాస్ స్పిరిట్ పనుల్లో బిజీగా..
ప్రభాస్ స్పిరిట్ పనుల్లో బిజీగా ఉన్న సందీప్ వంగ తన ప్రొడక్షన్ విషయంలో కూడా గట్టి ప్లానింగ్ తోనే వస్తున్నాడని అంటున్నారు. సందీప్ వంగ ఏం చేసినా సరే అదో ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ స్పిరిట్ కోసం ఆడియో టీజర్ వదిలు సర్ ప్రైజ్ చేశాడు సందీప్. అది కూడా ఏ.ఐ వాడి దాన్ని చేయడం అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ప్రభాస్ కూడా సందీప్ వంగ తో చేసే స్పిరిట్ కోసం చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాడని తెలుస్తుంది.
సందీప్ కూడా ప్రొడక్షన్ లోకి వస్తే టాలెంటెడ్ పీపుల్ కి మంచి అవకాశాలు దొరికే ఛాన్స్ ఉంటుంది. మరి ఇంతకీ సందీప్ వంగ ప్రొడక్షన్ లో ఎలాంటి ప్రాజెక్ట్ వస్తుందో వెయిట్ చేయాల్సిందే. స్పిరిట్ ని త్వరలో సెట్స్ మీదకు తీసుకెళ్తున్న సందీప్ వంగ 2027 రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడని టాక్. సో నెక్స్ట్ ఇయర్ సందీప్ డైరెక్షన్ సినిమా రాకపోయినా సుమంత్ ప్రభాస్ తో చేస్తున్న ఈ సినిమా మాత్రం రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.