అడివి శేష్ 'G2'.. ఇది మామూలు ప్లాన్ కాదుగా!

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్.. ఇప్పుడు డెకాయిట్ తోపాటు జీ 2 (G2) మూవీ కూడా చేస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-12-10 15:30 GMT

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్.. ఇప్పుడు డెకాయిట్ తోపాటు జీ 2 (G2) మూవీ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. 2018లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన స్పై యాక్షన్ థ్రిల్లర్ గూఢచారికి సీక్వెల్ గా జీ 2 చిత్రం రూపొందుతోంది. మూడేళ్ల క్రితం ఆ సినిమాను అనౌన్స్ చేయగా.. ఇప్పటికీ ఇంకా సెట్స్ పైనే ఉంది.

దీంతో మూవీ లవర్స్, ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ అవ్వగా.. రీసెంట్ గా అడివి శేష్ క్రేజీ అప్డేట్ ఇచ్చిన సంగతి విదితమే. జీ 2 మూవీని 2026 మే 1వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు శేష్ తెలిపారు. మే డే స్పెషల్ గా వచ్చే ఏడాది వేసవిలో అందరికీ సినిమా చూపించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు.

ఆరు దేశాల్లో 23 సెట్లు వేసి, 150 రోజుల పాటు షూటింగ్ చేశామని చెప్పారు. అంతే కాదు.. జీ 2 తన కెరీర్ లోనే అతి పెద్ద సినిమా అని తెలిపారు. ఇప్పుడు సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు. G2 అనేది ఆరు వేర్వేరు దేశాల్లో తీసిన బిగ్గెస్ట్ మూవీ అని చెప్పారు. నాచురల్ లొకేషన్స్ లోనే అంతా షూట్ చేశామని పేర్కొన్నారు.

అయితే గ్రీన్ మ్యాట్స్ వేసి ఆ సన్నివేశాలు అన్నీ తెరకెక్కించే ఛాన్స్ ఉందని, అలా చేస్తే సినిమా షూటింగ్ ను త్వరగా పూర్తి చేయొచ్చని తెలిపారు. కానీ అంతే తర్వగా సినిమా థియేటర్స్ నుంచి వెళ్లిపోతోందని అభిప్రాయపడ్డారు. అందుకే గూఢచారి సీక్వెల్ కోసం అనేక సహజమైన ప్రదేశాలను ఉపయోగిస్తున్నామని చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం అడివి శేష్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో జీ 2 సినిమాపై ఇంట్రెస్ట్ పెరుగుతోందని అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మేకర్స్ భారీ ప్లాన్ వేస్తున్నట్లు ఉన్నారని, సినిమా కోసం తాము ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు.

ఇక సినిమా విషయానికొస్తే.. గూఢచారి చిత్రానికి శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించగా.. ఇప్పుడు సీక్వెల్ ను వినయ్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. అడివి శేష్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఆయనకు జోడీగా వామికా గబ్బి నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ విలన్ గా యాక్ట్ చేస్తుననారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు.

Tags:    

Similar News