ఒక రాక్షసుడ్ని మరో రాక్షస మూక చంపేసింది

Update: 2015-07-21 10:14 GMT
నాగరిక సమాజంలో అనాగరికంగా వ్యవహరించే మిలిటెంట్ గ్రూపులు చాలానే ఉన్నాయి. వీటిల్లో అత్యంత దారుణంగా.. కిరాతకంగా వ్యవహరించే ఐఎస్ తీవ్రవాదులంటే వణుకే. అత్యంత అమానుషంగా.. మనుషులెవరూ చేయలేనన్ని అకృత్యాలు చేసే ఐఎస్ తీవ్రవాదులకు.. బాంబులతో మారణహోమం చేసే మరో తీవ్రవాద సంస్థ అల్ ఖైదాకు అస్సలు పొసగదు.

తాజాగా లిబియాలోని ఐఎస్ గ్రూపుకి  భారీ షాక్ తగిలింది. ఈ తీవ్రవాద సంస్థకు చెందిన ఒక మిలిటెంట్ ను అల్ ఖైదా అనుబంధ సంస్థ.. ముజాహిదీన్ షురా కౌన్సిల్.. అత్యంత దారుణంగా హింసించి ఉరి తీసింది.

చిత్ర.. విచిత్రమైన శిక్షలు విధించే ఐఎస్ తీవ్రవాదుల తీరుకు తగ్గట్లే ఈ అల్ ఖైదా అనుబంధ సంస్థ వ్యవహరించటం గమనార్హం. తమ అదుపులోకి తీసుకున్న ఐఎస్ తీవ్రవాది అబు అలీ అల్ అన్బారీని బంధించి.. నగ్నంగా వీధుల్లో ఊరేగించారు.

లిబియాలోని తీర ప్రాంతమైన డెర్నాపై పట్టు సాధించేందుకు ఈ అల్ ఖైదా అనుబంధ సంస్థ పోరాడుతోంది. ఇందులో భాగంగా తమకు చిక్కిని ఐఎస్ తీవ్రవాదిని పట్టుకొని.. తమకు వ్యతిరేక పక్షంలో చేరినందుకు.. శిక్ష అంటూ ఉరి తీశారు. ఇరాక్.. సిరియాలో తమ ప్రతాపం చూపించే ఐఎస్ తీవ్రవాద సంస్థ.. లిబియాలో మాత్రం వరుసగా చేదు అనుభవాలు ఎదుర్కొంటోంది. మొత్తంగా.. ఒక రాక్షస బృందం మరో రాక్షస బృందానికి చెందిన రాక్షసుడ్ని చంపేంది. ఇద్దరూ దొందూ దొందే.
Tags:    

Similar News