Begin typing your search above and press return to search.

జగ్గూభాయ్ టూ అప్పలసూరి.. డబ్బింగ్ తో అదరగొట్టిన జగపతిబాబు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ నుండి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది.

By:  Madhu Reddy   |   26 May 2026 2:53 PM IST
జగ్గూభాయ్ టూ అప్పలసూరి.. డబ్బింగ్ తో అదరగొట్టిన జగపతిబాబు!
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ నుండి క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా కోసం వర్సటైల్ యాక్టర్ జగపతిబాబు అప్పలసూరి పాత్రలో డబ్బింగ్ చెప్తూ రప్ఫాడించారు. ఎమోషనల్ సీన్స్‌కు ఆయన వాయిస్ బేస్, నటన థియేటర్లలో ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయంలా కనిపిస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ విశేషాలు చూద్దాం

కథను మలుపు తిప్పే అప్పలసూరి:

ఎప్పుడూ స్టైలిష్ విలన్‌గానో, క్లాస్ తండ్రి పాత్రల్లోనో కనిపించే మన జగ్గూభాయ్.. ఈసారి ‘పెద్ది’ సినిమాలో ఊహించని రస్టిక్ అండ్ పవర్‌ఫుల్ మేకోవర్‌తో షాక్ ఇచ్చారు. ఇందులో ఆయన ‘అప్పలసూరి’ అనే చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. కథను ఒక రేంజ్‌లో మలుపు తిప్పే ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ రోల్ ఇదట.

డబ్బింగ్ థియేటర్‌లో పూనకాలు:

తాజాగా చిత్ర యూనిట్ జగపతిబాబు డబ్బింగ్ చెబుతున్న ఒక చిన్న వీడియోను రిలీజ్ చేసింది. ఆ క్లిప్‌లో ఆయన ఎమోషనల్ డైలాగులు చెబుతుంటే.. అబ్బా! థియేటర్లలో సీన్ ఏ రేంజ్‌లో పండబోతుందో అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు. ఇక క్యారెక్టర్‌లోకి లీనమై ఆయన చెప్పిన డైలాగ్ డెలివరీ, చూపించిన హావభావాలు అదరగొట్టేలా ఉన్నాయి.

జూన్ 4న భారీ రిలీజ్:

ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, ఏఆర్ రెహమాన్ పాటలు సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లాయి. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది.

మొత్తానికి బుచ్చిబాబు సన ‘ఉప్పెన’ తర్వాత మరోసారి క్యారెక్టర్లను ఎంత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడో ‘అప్పలసూరి’ గ్లింప్స్ చూస్తేనే అర్థమవుతోంది. జగ్గూభాయ్ మార్క్ యాక్టింగ్, చరణ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్ తో తోడైతే బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’ వేట మామూలుగా ఉండదు.