Begin typing your search above and press return to search.

అమెరికాలో మరో షాక్.. NSA రహస్య నెట్‌వర్క్ కూడా డౌన్!

అమెరికాలో విమానయాన, బ్యాంకింగ్ సేవల్లో అంతరాయాల తర్వాత తాజాగా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) ఉపయోగించే NSANet కూడా పనిచేయలేదు. నవంబర్ 17న ఏర్పడిన ఈ సమస్యతో కొన్ని అంతర్గత వ్యవస్థలు ప్రభావితమయ్యాయి. ముందుగా నిర్ణయించిన నిర్వహణ పనుల సమయంలోనే అంతరాయం వచ్చిందని NSA వెల్లడించింది. అయితే జాతీయ భద్రతకు సంబంధించిన కీలక కార్యకలాపాలు కొనసాగాయని స్పష్టం చేసింది. సైబర్ దాడికి ఆధారాలు లేవని తెలిపింది.

By:  Tupaki Desk   |   18 Nov 2026 12:21 PM IST
అమెరికాలో మరో షాక్.. NSA రహస్య నెట్‌వర్క్ కూడా డౌన్!
X

అమెరికాలో కీలక వ్యవస్థల్లో వరుసగా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. విమానయాన సేవల్లో అంతరాయం, బ్యాంకింగ్ వ్యవస్థల్లో ఇబ్బందుల తర్వాత ఇప్పుడు దేశ భద్రతకు సంబంధించిన నెట్‌వర్క్ కూడా పనిచేయలేదు. అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (NSA) ఉపయోగించే NSANetలో అంతరాయం ఏర్పడింది.

అత్యంత రహస్య సమాచారాన్ని NSA అధికారులు పరస్పరం పంపించుకోవడానికి ఈ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తారు. నవంబర్ 17న ఈ సమస్య వచ్చినట్లు అమెరికా మీడియా కథనాలు తెలిపాయి. మేరీల్యాండ్‌లోని ఫోర్ట్ మీడ్ ప్రధాన కార్యాలయంతో పాటు ఇతర ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగుల విధుల్లోనూ మార్పులు చేసినట్లు సమాచారం.

ఈ అంతరాయానికి సైబర్ దాడి కారణమని ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. సంస్థలో జరుగుతున్న సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సమయంలో సమస్య వచ్చి ఉండొచ్చని వార్తలు వచ్చినప్పటికీ, దీనిపై అధికారిక నిర్ధారణ లేదు.

NSA ఈ ఘటనపై స్పందించింది. ముందుగా నిర్ణయించిన నిర్వహణ పనుల సమయంలోనే అంతరాయం ఏర్పడిందని తెలిపింది. కొన్ని అంతర్గత వ్యవస్థలు ప్రభావితమైనా, జాతీయ భద్రతకు సంబంధించిన ముఖ్యమైన కార్యకలాపాలు మాత్రం కొనసాగాయని స్పష్టం చేసింది.

మరోవైపు, అమెరికాలో జరుగుతున్న సాంకేతిక అంతరాయాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశ్నించగా, ఇలాంటివి జరుగుతుంటాయని ఆయన వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఘటనలన్నింటికీ సైబర్ దాడులే కారణమని చెప్పడానికి ఆధారాలు లేవు.