Begin typing your search above and press return to search.

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌పై అసంతృప్తి పెరుగుతోందట.

By:  Tupaki Desk   |   19 Nov 2026 11:07 AM IST
వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌పై అసంతృప్తి పెరుగుతోందట. ఇరాన్ యుద్ధంపై వాన్స్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు కారణమని అమెరికా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు విదేశాంగ మంత్రి మార్కో రూబియోను ట్రంప్ మెచ్చుకుంటున్నారని, ఆయన 2028 అధ్యక్ష ఎన్నికల్లో మంచి అభ్యర్థి అవుతారని సన్నిహితుల దగ్గర చెప్పినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

రిపబ్లికన్ పార్టీ మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోవడానికి ఇరాన్ యుద్ధమే ప్రధాన కారణమని వాన్స్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ట్రంప్‌కు నచ్చలేదట. యుద్ధం వల్ల పార్టీకి రాజకీయంగా నష్టం జరిగినా, ఇరాన్‌పై దాడి చేయాలన్న తన నిర్ణయం సరైనదేనని వాన్స్ చెప్పాలని ట్రంప్ ఆశించారట.

రూబియో మాత్రం మొదటి నుంచీ ఇరాన్‌పై సైనిక చర్యను సమర్థిస్తున్నారు. అమెరికా భద్రత కోసం ఆ నిర్ణయం అవసరమని ఆయన చెబుతున్నారు. ఈ వైఖరి ట్రంప్‌కు నచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు ట్రంప్ తర్వాత రిపబ్లికన్ పార్టీకి వాన్స్ నాయకత్వం వహిస్తారని చాలామంది భావించారు. కానీ ఇప్పుడు ట్రంప్ నోట రూబియో పేరు వినిపిస్తోంది. రాయిటర్స్ నిర్వహించిన సర్వేలో కూడా రిపబ్లికన్ ఓటర్లలో 45 శాతం మంది రూబియోను మంచి అధ్యక్ష అభ్యర్థిగా పేర్కొనగా, వాన్స్‌కు 43 శాతం మద్దతు లభించింది.

ట్రంప్ మనసులో నిజంగా ఏముందో పక్కన పెడితే.. ఆయన దగ్గరే వాన్స్, రూబియో మధ్య పోటీ మొదలైందన్న చర్చ మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.