Begin typing your search above and press return to search.

ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!

ఓహియోలో మాజీ సెనేటర్ షెరాడ్ బ్రౌన్ విజయం సాధించగా, ఐయోవా, నార్త్ కరోలినాలోనూ డెమొక్రాట్లు కీలక విజయాలు నమోదు చేశారు.

By:  Tupaki Desk   |   5 Nov 2026 9:45 AM IST
ట్రంప్‌కు బిగ్ షాక్.. రెండు సభలూ డెమొక్రాట్ల ఖాతాలో!
X

అమెరికా రాజకీయాల్లో సంచలనం నమోదైంది. 2026 మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ సెనేట్, ప్రతినిధుల సభ రెండింటినీ కైవసం చేసుకుంది. ఈ ఫలితాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీకి భారీ రాజకీయ ఎదురుదెబ్బగా మారాయి.

టెక్సాస్, కాన్సాస్, ఓహియో, సౌత్ కరోలినా వంటి సంప్రదాయ రిపబ్లికన్ రాష్ట్రాల్లోనూ డెమొక్రాట్లు విజయాలు సాధించడం ఈ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దాదాపు 94 ఏళ్ల తర్వాత కాన్సాస్‌లో డెమొక్రాట్ సెనేటర్ ఎన్నిక కావడం, టెక్సాస్‌లో దశాబ్దాల తర్వాత పార్టీకి విజయం దక్కడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఓహియోలో మాజీ సెనేటర్ షెరాడ్ బ్రౌన్ విజయం సాధించగా, ఐయోవా, నార్త్ కరోలినాలోనూ డెమొక్రాట్లు కీలక విజయాలు నమోదు చేశారు.

2027 జనవరి నుంచి కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల ఆధిపత్యం మొదలుకానుంది. దీంతో ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలు, బడ్జెట్ ప్రతిపాదనలు, విధానాలపై ప్రతిపక్షం మరింత గట్టిగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వంపై విచారణలు చేపట్టే అధికారం కూడా డెమొక్రాట్లకు ఉంటుంది.

ఎన్నికల ఫలితాలపై ట్రంప్ స్పందిస్తూ.. తన పేరు కూడా బ్యాలెట్‌పై ఉండి ఉంటే రిపబ్లికన్లు భారీ విజయం సాధించేవారని Truth Socialలో పేర్కొన్నారు. డెమొక్రాట్లతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలిపారు.

ముఖ్యంగా అమెరికా సుంకాల విధానం, ఇరాన్ యుద్ధం, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం వంటి అంతర్జాతీయ అంశాలపై కొత్త కాంగ్రెస్ వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.