Begin typing your search above and press return to search.

అమెరికా వీసా సేవల నిలిపివేత... రీ ఓపెనింగ్ డేట్ ఇదే!

ఈ సేవల కోసం వినియోగిస్తున్న స్లాట్ ఫామ్ ను మరింత అప్ డేట్ చేసేందుకు

By:  Tupaki Desk   |   27 July 2023 5:26 AM GMT
అమెరికా వీసా సేవల నిలిపివేత... రీ ఓపెనింగ్ డేట్ ఇదే!
X

దేశవ్యాప్తంగా వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హైదరాబాద్‌ లోని అమెరికన్‌ కాన్సులేట్‌ తెలిపింది. ఈ సేవలు అందించేందుకు ప్రస్తుతం వినియోగిస్తున్న వ్యవస్థను మరింత అధునాతనంగా మార్పు చేసేందుకు ప్రస్తుతానికి అన్ని సేవలను నిలిపివేస్తున్నట్లు ట్విటర్‌ లో పేర్కొంది.

అవును... ప్రస్తుతం అందిస్తున్న ఈ సేవల కోసం వినియోగిస్తున్న స్లాట్ ఫామ్ ను మరింత అప్ డేట్ చేసేందుకు బుధవారం నుంచి శుక్రవారం వరకు అన్ని సేవలను నిలిపివేస్తున్నట్లు అమెరికన్ కాన్సులేట్ వెల్లడించింది. దేశ వ్యాప్తంగా సాఫ్ట్ వేర్ వ్యవస్థను ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించింది.

అనంతరం ఈ నెల 28వ తేదీ వరకు వరకు అన్ని సేవలను నిలిపివేస్తున్నట్లు కాన్సులేట్ ట్విట్టర్ లో పేర్కొంది. వీసా ఫీజు చెల్లింపులు, ఇంటర్వ్యూ అపాయింట్ మెంట్స్ తదితర అన్ని సేవలు ఈ నెల 29 (శనివారం) నుంచి యథావిధిగా అందుబాటులోకి వస్తాయని తెలిపింది.

ఇదే క్రమంలో కస్టమర్‌ సర్వీస్‌ ఈ-మెయిల్‌ ఐడీ కూడా మారుతుందని తెలిపిన అమెరికన్ కాన్సులేట్... శనివారం నుంచి support-india@usvisascheduling.com ద్వారా సంప్రదించవచ్చని తెలిపింది. మార్పులకు సంబంధించిన మరింత సమాచారం కోసం https://www.ustraveldocs.com/ వెబ్‌ సైట్‌ ను చూడవచ్చని వివరించింది.

ఇక శనివారంలోగా అత్యవసరంగా వీసాలు, ఇతర సేవలు కావాల్సిన వారు Hydcons chief@state.gov లేదా హ్య్ద్చే Hydcea@state.gov మెయిల్స్‌ లో సంప్రదించవచ్చని అమెరికన్‌ కాన్సులేట్‌ ట్వీట్‌ లో పేర్కొంది. రెండు రోజుల పాటు నిలిచే ఈ సేవలను తిరిగి శనివారం నుంచి యధావిధిగా పునరుద్దించేలా చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది.