Begin typing your search above and press return to search.

భారతీయులకు స్కెంజెన్ వీసా... స్విట్జర్లాండ్ ఎంబసీ క్లారిటీ ఇది!

గతకొన్ని రోజులుగా స్విట్జర్లాండ్ దేశం వీసాల అపాయింట్మెంట్ లు నిలివేసిందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   4 Aug 2023 4:32 AM GMT
భారతీయులకు స్కెంజెన్ వీసా... స్విట్జర్లాండ్ ఎంబసీ క్లారిటీ ఇది!
X

గతకొన్ని రోజులుగా స్విట్జర్లాండ్ దేశం... వీసాల అపాయింట్మెంట్ లు నిలివేసిందంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్కెంజెన్ వీసాలను నిలిపివేసిందని ఒక రచారం వైరల్ గా జరుగుతుంది. భారత పర్యాటక గ్రూపులకు ఇబ్బందులు తెస్తోందని అంటున్నారు. తాజాగా ఈ విషయాలపై స్విట్జర్లాండ్ ఎంబసీ క్లారిటీ ఇచ్చింది.

అవును... వీసాల అపాయింట్మెంట్‌ లు నిలిపివేశారంటూ జరుగుతున్న ప్రచారంపై స్విట్జర్లాండ్ స్పందించింది. వీసాల అపాయింట్మెంట్‌ లు అక్టోబర్ వరకు నిలిపివేశారనే వార్తల్లో నిజం లేదని స్పష్టతనిచ్చింది. ఈ మేరకు భారతదేశంలోని స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయం వివరాలు వెల్లడించింది.

భారత పర్యాటక గ్రూపులకు స్కెంజెస్ వీసాలను నిలిపివేయలేదని తెలిపింది. ఈ సందర్భంగా... భారత్-స్విస్ పౌరుల మధ్య బంధం ఎంతో ప్రధానమైందని ప్రకటించింది. భారత పర్యాటక బృందాలకు వీసా అపాయింట్మెంట్లను భారత్‌ లోని స్విట్జర్లాండ్ ఎంబసీ నిలిపివేయలేదని తేల్చి చెప్పింది.

ఇదే సమయంలో దీనికి సంబంధించిన ఘణాంకాల వివరాలు వివరించింది. ఇందులో భాగంగా... సెప్టెంబర్ 2023 వరకు నిత్యం దాదాపు 800 అపాయింట్మెంట్‌ లు ఉన్నాయని తెలిపిన స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయం... ఇందులో 22 గ్రూపులు ఉన్నాయని తెలిపింది.

2019తో పోలిస్తే 2023లో జూన్ వరకూ వరకు అత్యధిక వీసాలను జారీ చేశామని తెలిపిన ఎంబసీ అధ్హికారులు... ఈ ఏడాదిలో జనవరి నుంచి జూన్ వరకు 1.29 లక్షల దరఖాస్తులను పరిశీలించామని తెలిపారు. ఇవి కోవిడ్ ముందుతో పోలిస్తే 7.8 శాతం ఎక్కువ అని అంటున్నారు.

ఇదే క్రమంలో... భారతీయుల వీసాల ప్రక్రియను ఈ ఏడాది మరింత సులభతరం చేసేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నట్లు తెలిపిన భారత్‌ లోని స్విట్జర్లాండ్ ఎంబసీ అధికారులు... ఇందులో భాగంగా ప్రయాణానికి ఆరు నెలల ముందుగానే వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కాగా.. గతంలో ఇది కేవలం నెల మాత్రమే ఉండేది.

కాగా... ఐరోపా దేశాల మధ్య 90 రోజుల వరకు పర్యటించేందుకు వీలుగా "స్కెంజెస్ వీసా"లను జారీ చేస్తుంటారు. ఐరోపా సమాఖ్యలోని ఏదైనా సభ్యదేశం దీనిని జారీ చేస్తే.. ఆ వీసాతో ఇతర యూరప్ దేశాల్లో కూడా పర్యటించేందుకు అనుమతి లభిస్తుంది.