Begin typing your search above and press return to search.

సమంత వస్తువు దొంగిలించిన కోతి

ఇన్ స్టాగ్రామ్‌ లో సమంత షేర్‌ చేసిన ఫోటోలు ఆమె ఉల్లాసంగా ఉత్సాహంగా ఉందని తెలియజేస్తున్నాయి

By:  Tupaki Desk   |   27 July 2023 8:16 AM GMT
సమంత వస్తువు దొంగిలించిన కోతి
X

సినిమాలు.. షూటింగ్స్ ఇతర విషయాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్న సమంత ప్రస్తుతం బాలిలో ఉన్న విషయం తెల్సిందే. ఆమె షూటింగ్స్ కు బ్రేక్ తీసుకున్నా కూడా వర్కౌట్స్ చేస్తూనే ఉంది. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా తన రెగ్యులర్‌ హాలీడే ట్రిప్ ను అభిమానులతో పంచుకుంటూనే ఉంది.


ఇన్ స్టాగ్రామ్‌ లో సమంత షేర్‌ చేసిన ఫోటోలు ఆమె ఉల్లాసంగా ఉత్సాహంగా ఉందని తెలియజేస్తున్నాయి. తాజాగా ఒక కోతితో ఆమె సెల్ఫీ తీసుకుంది. అది కాస్త వైరల్‌ అయింది. అంతే కాకుండా ఆ కోతి ఆ తర్వాత తన సన్ గ్లాస్ ను ఎత్తుకు వెళ్లిందని సరదా పోస్ట్ ను చేసింది. తన సన్ గ్లాస్ ను ఎత్తుకు వెళ్లిన కోతి ఫోటోను కూడా సామ్ షేర్ చేసింది.

ఆ కోతికి మంచి టేస్ట్‌ ఉంది.. అందుకే తన సన్ గ్లాస్ ను ఎత్తుకు వెళ్లిందని సమంత అంది. నా సన్‌ గ్లాస్‌ తో ఇదే చివరి ఫోటో అన్నట్లుగా సమంత ఒక ఫోటోను షేర్‌ చేసింది. అంతకు ముందు ఆమె పోస్ట్‌ చేసిన ఫోటోల్లో సన్‌ గ్లాస్ లు పెట్టుకుని ఉండటం గమనించవచ్చు.

మొత్తానికి సమంత తన సన్ గ్లాస్ ను కోతి ఎత్తుకు వెళ్లి పోయిందని పెట్టిన పోస్ట్‌ అందరికి షాకింగ్ గా మారింది. కోతి ఇలా వస్తువులు ఎత్తుకు వెళ్తుందా అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటే... కొందరు మాత్రం ఆ కోతికి ఏదైనా ఫుడ్‌ ఇస్తే ఆ సన్ గ్లాస్ ను తిరిగి ఇచ్చేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే విజయ్ దేవరకొండ తో కలిసి నటించిన ఖుషి సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా తో పాటు ప్రముఖ దర్శక ద్వయం రాజ్ అండ్‌ డీకే దర్శకత్వంలో చేసిన సిటాడెల్‌ సిరీస్ తో కూడా సమంత ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఏడాది పాటు విశ్రాంతి తీసుకోబోతున్న సమంత ఈ రెండు ప్రాజెక్ట్‌ ల ప్రమోషన్స్ కు హాజరు అయ్యేనా చూడాలి.