Begin typing your search above and press return to search.

కమల్ కూడా 'ప్రాజెక్ట్‌' పని మీదే వెళ్లాడా?

ఇంతకు కమల్‌ హాసన్‌ అమెరికా వెళ్లింది ప్రాజెక్ట్‌ కే సినిమా ప్రమోషన్ లో భాగంగా కామిక్ కాన్‌

By:  Tupaki Desk   |   19 July 2023 3:48 AM GMT
కమల్ కూడా ప్రాజెక్ట్‌ పని మీదే వెళ్లాడా?
X

ప్రభాస్‌.. నాగ్‌ అశ్విన్ కాంబోలో రూపొందుతున్న 'ప్రాజెక్ట్‌ కే' సినిమా ను అమెరికాలో జరగబోతున్న అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌ శాన్ డియాగో కామిక్ కాన్ లో ప్రమోట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా టీజర్ ను కామిక్ కాన్ ఈవెంట్ లో ఆవిష్కరించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

కామిక్ కాన్ ఈవెంట్‌ కోసం రానా తో కలిసి ప్రభాస్ ఇప్పటికే అమెరికా చేరుకున్నాడు. చిత్ర యూనిట్‌ సభ్యులు హీరోయిన్స్ కూడా అమెరికా ఫ్లైట్ ఎక్కినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న కమల్‌ హాసన్‌ కూడా అమెరికా లో ఉన్న ఫోటో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అవ్వడం చర్చనీయాంశం అయింది.

ఇంతకు కమల్‌ హాసన్‌ అమెరికా వెళ్లింది ప్రాజెక్ట్‌ కే సినిమా ప్రమోషన్ లో భాగంగా కామిక్ కాన్‌ లో పాల్గొనేందుకు అయి ఉంటుందా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఈ నెల 20 నుండి జరుగబోతున్న కామిక్ కాన్ ఈవెంట్‌ లో కమల్‌ హాసన్‌ కూడా పాల్గొంటే కచ్చితంగా సినిమా స్థాయి మరింతగా పెరగడం ఖాయం.

టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ తో హాలీవుడ్‌ రేంజ్ టెక్నాలజీతో.. టెక్నీషియన్స్ తో ప్రాజెక్ట్‌ కే సినిమా రూపొందుతోంది. మహానటి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాను ప్రకటించాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌ పై అశ్వినీదత్ దాదాపుగా రూ.500 కోట్ల బడ్జెట్‌ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల అవ్వబోతుంది.