Begin typing your search above and press return to search.

మోదీ మెగా టూర్స్.. పదేళ్లు.. 70 దేశాలు.. లైన్ లో మరో 7

ఇంతకుముందు భారత ప్రధానులు ఎవరికీ సాధ్యం కాలేదు.. అసలు ప్రపంచంలో మరే దేశాధినేతకైనా సాధ్యమైందో లేదో తెలియదు

By:  Tupaki Desk   |   5 Sep 2024 3:15 AM GMT
మోదీ మెగా టూర్స్.. పదేళ్లు.. 70 దేశాలు.. లైన్ లో మరో 7
X

ఇంతకుముందు భారత ప్రధానులు ఎవరికీ సాధ్యం కాలేదు.. అసలు ప్రపంచంలో మరే దేశాధినేతకైనా సాధ్యమైందో లేదో తెలియదు.. పదేళ్లు.. 70 దేశాలు.. మొత్తం 79 పర్యటనలు.. లైన్ లో మరో ఏడు.. ఇంకా మరెన్నో..? ఇదీ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘనత. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ఆయన బ్రూనైకు వెళ్లారు. ఓ భారత ప్రధాని ఆ దేశం వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇందులో బద్ద శత్రువులైన ఇరాన్-అమెరికా, రష్యా-ఉక్రెయిన్ లోనూ పర్యటించిన ఘనత మోదీ సొంతం. మరోవైపు పాకిస్థాన్ లోనూ కాలుపెట్టారు ఆయన. మూడో విడత అధికారం చేపట్టిన మూడు నెలల్లోనే ఇటలీ (జి-7 సదస్సుకు), రష్యా, ఆస్ట్రియా, పోలండ్, ఉక్రెయిన్ లను చుట్టొచ్చారు. ఇప్పుడు బ్రూనై నుంచి సింగపూర్ వెళ్తున్నారు.

ప్రపంచంపై భారత్ ముద్ర

మోదీ.. అత్యంత చురుకైన నాయకుడు అనడంలో సందేహం లేదు. ఆయన విదేశీ పర్యటనలు కచ్చితంగా భారత్ ను ప్రపంచంలో ప్రత్యేకంగా నిలుపుతాయి. ఆయా దేశాలకు వెళ్లిన సందర్భంగా మోదీ.. పలు ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. ఇందులో నేరగాళ్ల ఒప్పందం నుంచి అంతరిక్ష సహకారం వరకు అనేక అంశాలు ఉంటున్నాయి. ప్రపంచ ఐదో ఆర్థిక అతిపెద్ద శక్తిగా ఎదిగే క్రమంలో ఇవన్నీ కలిసొస్తాయి. తద్వారా భారత్ అనే దేశం ఇక ఎంతమాత్రం వెనుకబడింది కాదనే సందేశం కూడా వెళ్తుంది.

మోదీ ఒకసారి పర్యటించిన దేశాలు: అర్జెంటీనా, ఆస్ట్రియా, బహ్రెయిన్, బెల్జియం, బ్రూనై, కెనడా, డెన్మార్క్, ఈజిప్ట్, ఫిజీ, గ్రీస్, ఇరాన్, ఐర్లాండ్, ఇజ్రాయెల్, జోర్డాన్, కెన్యా, లావోస్, మారిషస్, మెక్సికో, మంగోలియా, మొజాంబిక్, నెదర్లాండ్స్, ఒమన్, పాకిస్తాన్, పాపువా న్యూ గినియా, పాలస్తీనా, ఫిలిప్పీన్స్, పోలాండ్, పోర్చుగల్, రువాండా, సీషెల్స్, స్పెయిన్, స్వీడన్, తజికిస్తాన్, టాంజానియా, టర్కీ, తుర్క్‌మెనిస్తాన్, ఉగాండా, ఉక్రెయిన్, వాటికన్ సిటీ, వియత్నాం.

రెండుసార్లు వెళ్లిన దేశాలు: అఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, బ్రెజిల్, ఇటలీ, కజకిస్తాన్, కిర్గిజిస్థాన్, మలేషియా, మాల్దీవులు, మయన్మార్, ఖతార్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్, థాయిలాండ్.

మూడు సార్లు వెళ్లినవి: భూటాన్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, యునైటెడ్ కింగ్‌డమ్, ఉజ్బెకిస్తాన్

ఐదుసార్లు వెళ్లినవి: చైనా, నేపాల్, సింగపూర్

ఆరుసార్లు కాలుపెట్టినవి: జర్మనీ, రష్యా

ఏడుసార్లు: ఫ్రాన్స్, జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

8 సార్లు: అమెరికా (కాగా, అమెరికాలోని న్యూయార్క్ లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఉంది. దీని సమావేశాల్లో పాల్గొనేందుకు మోదీ పలుసార్లు అమెరికా వెళ్లారు.)

మోదీ ఇదే నెలలో ఐక్యరాజ్య సమితి సదస్సుతో పాటు అమెరికా పర్యటనకు వెళ్తారు. అక్టోబరులో సమోవా, రష్యా (బ్రిక్స్ సదస్సుకు), అక్టోబరు-నవంబరులో లావోస్, నవంబరులో అజర్ బైజాన్, బ్రెజిల్ లో పర్యటిస్తారు.