Begin typing your search above and press return to search.

భారత్ లో విమానాలకు విముక్తి.. తేదీ మారింది!

అవును... భారత్ - పాక్ మద్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశంలో 32 విమానాశ్రయాలను మూసేసిన కేంద్రం, మరికొన్నింటిని హై సెక్యురిటీ జోన్ లో పెట్టింది.

By:  Tupaki Desk   |   12 May 2025 7:20 PM IST
భారత్  లో విమానాలకు విముక్తి.. తేదీ మారింది!
X

ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ - పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర, పశ్చిమ భారత్ లోని పలు విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా.. ఆ విమానాశ్రయాల సంఖ్య 32 కాగా.. ఎప్పటివరకూ అనే ప్రశ్నకు సమాధానం మే 15. అయితే తాజాగా గుడ్ న్యూస్ వచ్చేసింది.

అవును... భారత్ - పాక్ మద్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశంలో 32 విమానాశ్రయాలను మూసేసిన కేంద్రం, మరికొన్నింటిని హై సెక్యురిటీ జోన్ లో పెట్టింది. ఈ సమయంలో శనివారం సాయంత్రం తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తొలగిపోవడంతో ఎయిర్ పోర్టులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రకటించింది.

వాస్తవానికి తొలుత మే 15వరకూ మూసివేయాలని భావించినప్పటికీ.. కారణం ఏదైనప్పటికీ పరిస్థితులు కాస్త మెరుగుపడటంతో వాటిని తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. ఇదే సమయంలో.. పౌర విమానయాన కార్యకలాపాలు వెంటనే అందుబాటులోకి వస్తాయని.. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

కాగా... పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్ లోని వివిధ ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు చేయడంతో.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చండీగఢ్, శ్రీనగర్, అమృత్ సర్, శింలా, జోధ్ పుర్, ధర్మశాల, కిషన్ గఢ్, జమ్మూ, రాజ్ కోట్ తదితర విమానాశ్రయాలను మూసివేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది.