Begin typing your search above and press return to search.

అతిపెద్ద క్రూజ్ నౌక ఫస్ట్ జర్నీ స్టార్ట్... తెరపైకి భారీ విమర్శలు!

ఈ క్రమంలో వారం రోజుల పాటు కరీబియన్ దీవులను చుట్టేయనుంది.

By:  Tupaki Desk   |   29 Jan 2024 12:30 PM GMT
అతిపెద్ద క్రూజ్  నౌక ఫస్ట్  జర్నీ స్టార్ట్... తెరపైకి భారీ విమర్శలు!
X

ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక "ఐకాన్ ఆఫ్ ది సీస్" తన తొలి విహారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా... అమెరికాలో ఫ్లోరిడాలోని మయామీ నుంచి బయలుదేరింది. రాయల్ కరీబియన్ సంస్థ రుపొందించిన ఈ షిప్‌.. సముద్రంలో ప్రయాణాన్ని మొదలెట్టిన అతిపెద్ద క్రూజ్ నౌకగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో వారం రోజుల పాటు కరీబియన్ దీవులను చుట్టేయనుంది. అత్యంత లగ్జరీ సౌకర్యాలు ఉన్న ఈ షిప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం...!

ప్రత్యేకతలు - సౌకర్యాలు!:

రాయల్ కరీబియన్ సంస్థ రుపొందించిన "ఐకాన్ ఆఫ్ ద సీస్" మొత్తం పొడవు 365 మీటర్ల (1,197 అడుగులు) కాగా... ఇందులో 20 డెక్‌ లు ఉన్నాయి. సుమారు 2,350 మంది సిబ్బంది పనిచేసే ఈ షిప్ లో మాగ్జిమం 7,600 మంది ప్రయాణించవచ్చు. దీని బరువు సుమారు 2 లక్షల 50 వేల 800 టన్నులుగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

ఇక ఈ నౌకలో ఆరు వాటర్ స్లైడ్లు, ఏడు స్విమ్మింగ్ పూల్స్ ఈ నౌకలో ఉన్నాయి. అలాగే ఐస్ స్కేటింగ్ రింగ్ సైతం ఏర్పాటు చేశారు. వీటితోపాటు పాటు ఒక సినిమా థియేటర్, 40కిపైగా రెస్టారెంట్లు, బార్లు ఏర్పాటు చేశారు. ఈ "ఐకాన్ ఆఫ్ ది సీస్" ను రూపొందించేందుకు సుమారు 2 బిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.16,624 కోట్లు ఖర్చయిందని చెబుతున్నారు.

నేమింగ్ సెరిమనీలో “మెస్సీ” సందడి!:


అర్జెంటీనా ప్రపంచ కప్ విజేత కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఈ నౌక "నేమింగ్ సెరిమనీ"లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రత్యేకంగా రూపొందించిన స్టాండ్‌ పై ఫుట్‌ బాల్‌ ను ఉంచిన మెస్సీ.. నౌకా ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటూ నౌక ముందు నిల్చుని శాంపైన్ బాటిల్‌ పగలకొట్టారు. ఈయన ప్రస్తుతం ఇంటర్ మయామీ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే.

ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు!:


ప్రపంచంలోనే అతిపెద్ద క్రూజ్ నౌక తొలి ప్రయాణం షురూ చేసిన సమయంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా... లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ (ఎల్‌.ఎన్‌.జీ)తో నడిచే ఈ నౌకపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో... ఈ నౌక వల్ల అత్యంత ప్రమాదకర మిథేన్ వాయువు విడుదలయ్యే ప్రమాదముందని అంటున్నారు.

ఇదే క్రమంలో... సముద్ర ప్రయాణానికి ఇంధనంగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌ (ఎల్.ఎన్.జి.)ను వాడటం వల్ల మెరైన్ గ్యాస్ ఆయిల్‌ తో పోలిస్తే 120 శాతానికి పైగా అధిక "లైఫ్ సైకిల్ గ్రీన్‌ హౌస్ గ్యాస్ ఉద్గారాలు" విడుదల అవుతాయని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ క్లీన్ ట్రాన్స్‌ పోర్టేషన్ (ఐసీసీటీ) మెరైన్ ప్రోగ్రాం డైరెక్టర్ బ్రయాన్ కోమర్‌ చెబుతున్నారని తెలుస్తుంది!