ఎయిర్ ఇండియా వీడియో వైరల్... భారత-అమెరికన్ సీఈవో 'చెత్త' అనుభవం!!
ఈ సమయంలో తాజాగా ఓ భారతీయ అమెరికన్ ఎయిర్ ఇండియా విమానంలో తన చేదు అనుభవాలను పంచుకున్నాడు.
By: Tupaki Desk | 19 Sep 2024 4:25 AM GMTఇటీవల కాలంలో విమాన ప్రయాణాల్లో ఎదురైన చేదు అనుభవాలు నెట్టింట హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఒక్కొక్కరూ ఒక్కో అనుభవాన్ని పంచుకుంటూ సదరు విమానయాన సంస్థలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమయంలో తాజాగా ఓ భారతీయ అమెరికన్ ఎయిర్ ఇండియా విమానంలో తన చేదు అనుభవాలను పంచుకున్నాడు.
అవును... ఓ భారతీయ అమెరికన్ ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తూ తన అనుభవాన్ని "చెత్త" అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా క్యాపిటెల్ ఇన్వెస్ట్మెంట్ సీఈఓ అనిప్ పటేల్ ఇన్ స్టా లో ఓ వీడియోను విడుదల చేశారు. చికాగో నుండి ఢిల్లీకి జరిగిన తన 15 గంటల నాన్ స్టాప్ ఫ్లైట్ జర్నీ ఏమాత్రం ఆహ్లాదకరంగా లేదని, భరించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
తాను గతంలో కూడా ఎయిర్ ఇండియా గురించి అనేక ప్రతికూల విషయాలను విన్నట్లు తెలిపిన పటేల్... కొత్త నిర్వహణలో ఇటీవల మార్పులు వచ్చిఉంటాయని తాను భావించినట్లు తెలిపారు. అయితే... దురదృష్టవసాత్తు అలాంటిదేమీ జరగలేదని వెల్లడించారు. తాను ఫస్ట్ క్లాస్ క్యాబిన్ కోసం చెల్లించినప్పటికీ.. ఆ సౌకర్యాలేమీ పోందలేకపోయినట్లు పేర్కొన్నారు.
తాను ఎన్నడూ లేనంత చెత్త ఫస్ట్ క్లాస్ క్యాబిన్ కి రండి అంటూ తన వీడియోలో పేర్కొన్న పటేల్... చికాగో నుంచి ఢిల్లీ నాన్ స్టాప్ ఎయిర్ ఇండియా విమానం ఇదని.. 6,300 డాలర్లు పెట్టి టిక్కెట్ కొని, ఈ వాతావరణంలో సుమారు 2,50,000 మైళ్లు ప్రయాణించడం ఎంత దారుణంగా ఉందో చూడండి అంటూ ప్రతీ విషయాన్ని చుపించాడు!
ఈ క్రమంలో... ప్రతీ కంపార్ట్మెంట్ లోనూ వస్తువులు కదులుతున్నాయని, చెత్త పట్టి ఉన్నాయని చూపించాడు. ఇక మెనూలోని ఆహార పదార్థాల విషయానికొస్తే 30శాతం అందుబాటులో లేవని తెలిపారు. తాను ప్రయాణించిన 15 గంటలూ ఎలాంటి ఎంటర్టైన్ మెంట్ లేదని.. అన్నీ విరిగిపోయాయని.. ఉన్న ఎంటర్ టైన్ మెంట్ సిస్టం ను ఐదు సార్లు రీస్టార్ట్ చేసినా పనిచేయలేదని పేర్కొన్నాడు.
ప్రస్తుతం అనిప్ పటేల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో కింద తమ తమ అనుభవాలు, అభిప్రాయాలతో కామెంట్ సెక్షన్ ను నింపేస్తున్నారు నెటిజన్లు!!