Begin typing your search above and press return to search.

విమానంలో ఆకతాయి చెంప పగులకొట్టిన నటి

విమానంలో ఎదురైన చేదు అనుభవంను గురించి శ్రీసుధ సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుని తన ఆవేదనను తెలియజేసింది.

By:  Tupaki Desk   |   26 July 2023 10:15 AM GMT
విమానంలో ఆకతాయి చెంప పగులకొట్టిన నటి
X

తెలుగు ప్రేక్షకులకు నటి శ్రీసుధ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించడం ద్వారా గుర్తింపు దక్కించుకుంది. అంతే కాకుండా ఆ మధ్య ఒక వివాదం కారణంగా వార్తల్లో నిలిచింది. తనకు ఆఫర్‌ ఇస్తానంటూ మోసం చేశాడని ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వ్యక్తిపై ఆరోపణలు చేయడంతో వార్తల్లో నిలిచింది.

ఆ విషయం పక్కన పెడితే తాజాగా శ్రీసుధ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈసారి తనను విమానంలో ఇబ్బంది పెడుతున్న వ్యక్తి గూబ పై ఒక్కటి కొట్టడం ద్వారా ఈమె గురించి చర్చ మొదలైంది. విమానంలో ఎదురైన చేదు అనుభవంను గురించి శ్రీసుధ సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేసుకుని తన ఆవేదనను తెలియజేసింది.

విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో వెనుక ఉన్న వ్యక్తి పదే పదే ముందు ఉన్న నా కాలును తన్నుతూ ఉన్నాడు. పలు సార్లు చెప్పినా.. అక్కడ ఉన్న సిబ్బందికి చెప్పినా కూడా అతడి పద్దతి మారలేదు. దాంతో అతడిని కొట్టాను అంటూ శ్రీ సుధ స్వయంగా చెప్పుకొచ్చింది.

అతడు ఎవరు.. ఏ విమానంలో ఎప్పుడు జరిగింది అనే విషయం చెప్పలేదు. కానీ సోషల్‌ మీడియాలో తనకు జరిగినట్లుగా చాలా మందికి ఇలాంటి అనుభవాలు జరుగుతున్నట్లుగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

అలాంటి ఆకతాయిలకు ఇలాగే బుద్ది చెప్పాలి అంటూ కొందరు ఆమెను సమర్థిస్తే చిన్న విషయానికి పబ్లిసిటీ కోసం పెద్దదిగా చేస్తున్నారా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి శ్రీ సుధ మరోసారి వార్తల్లో నిలిచింది.