Begin typing your search above and press return to search.

సికింద్రాబాద్ బరిలో వైఎస్ షర్మిళ... తెరవెనుక కేవీపీ?

తాజాగా వైఎస్ షర్మిళ కు సంబంధించిన ఒక చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది

By:  Tupaki Desk   |   22 July 2023 9:48 AM GMT
సికింద్రాబాద్  బరిలో వైఎస్  షర్మిళ... తెరవెనుక కేవీపీ?
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు అత్యంత వేగంగా మారిపోతున్నాయి. ఇందులో భాగంగా ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు.. ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారు చేస్తారు.. ఎవరు అసెంబ్లీకి, మరెవరు పార్లమెంటుకి అనే ప్రశ్నలపై విపరీతంగా చర్చ జరుగుతుంది.

ఈ క్రమంలో తాజాగా వైఎస్ షర్మిళ కు సంబంధించిన ఒక చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ షర్మిళ.. వైఎస్సార్టీపీ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె పాదయాత్ర కూడా చేశారు.

అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం... ఆమె తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుంటున్నారనే కథనాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ని షర్మిళ కలిసిన అనంతరం ఈ కథనాలు మరింతగా పెరిగాయి.

ఈ నేపథ్యంలో... పొత్తుకోసం షర్మిళ ప్రజోజ్ పెట్టగా.. విలీనం కోసం కాంగ్రెస్ ప్రతిపాదించిందని ఊహాగాణాలు వెలువడ్డాయి. అయితే ఇకపై పొత్తు ఉండకపోవచ్చు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా షర్మిళకు తగిన ప్రాధాన్యం ఇస్తూ.. ఆమె పార్టీని విలీనం చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయని అంటున్నారు.

ఈ మేరకు డీకే శివకుమార్ తో పాటు.. తాజాగా కేవీపీ రామచంద్రరావు పావులు కదుపుతున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఆమెను లోక్ సభ స్థానానికి పోటీ చేయాలని సూచిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా సికింద్రాబాద్ లోక్ సభ స్థానాన్ని ప్రతిపాదిస్తున్నారంట.

అవును... నిన్నమొన్నటివరకూ పాలేరు నుంచి అసెంబ్లీకి షర్మిళ పోటీ చేస్తారని ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆమె పాలేరులో ఆఫీసు నిర్మాణం కూడా చేపట్టారని కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆ నిర్మాణ పనులు కూడా మందగించాయని అంటున్నారు.

ఒక వేళ విలీనం అనివార్యం అయ్యి... సికింద్రాబాద్ నుంచి లోక్ సభకు కాంగ్రెస్ తరుపున పోటీ చేయాల్సి వస్తే... పాలేరు లో ఆ ఆఫీసు నిర్మాణం కూడా అవసరం లేదని భావిస్తున్నారట. ఇక హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఎలాగూ గాంధీ భవన్ ఉంది.. పక్కనే షర్మిళకు లోటస్ పాండ్ కూడా ఉంది!

ఈ నేపథ్యంలో... షర్మిళ సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీచేయబోతున్నారనే విషయం మాత్రం రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారిందని తెలుస్తుంది. మరి నిజంగానే ఆమె సికింద్రబాద్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తారా.. లేక, పాలేరు నుంచి ఎమ్మెల్యేగానే ఆసక్తి చూపుతారా అనేది మరింత స్పష్ట రావాల్సి ఉందని తెలుస్తుంది.