ధూల్‌పేట టు నాయుడుపేట వరకు వీళ్లదే హవా... అసలు విషయం ఇదే..!
తామిచ్చే బ్లాక్‌ను వీరు వైట్ చేయాల్సి ఉంటుందని సదరు వ్యాపారులు కండిషన్లు పెడుతున్నారట
By: Tupaki Desk | 18 July 2023 4:33 AM GMTధూల్‌పేట.. నాయుడుపేట పెట్టారో.. అంటూ.. ఒకప్పటి శంకర్ సినిమాలో పాట గుర్తుండే ఉంటుంది. ఇప్పు డు ఈ పాటే వినిపిస్తోంది. దీనికి కారణం.. సంచుల కొద్దీ సొమ్ముతో పలువురు పొరుగు రాష్ట్రాలకు చెందిన ఫైనాన్సర్స్.. తెలంగాణ, ఏపీల్లో తిరుగుతున్నారట. అయ్యా అప్పులు కావాలా? అని ఆఫర్లు ఇస్తున్నారట. ఏడాదికి 10 పర్సంట్ వడ్డీ చాలని కూడా చెబుతున్నారట. ఇదేదో మంచి ఆఫర్ అనుకుంటున్నారా? ఎన్నికల వేళ నాయకులకు కలిసి వచ్చిందని భావిస్తున్నారా?
అయితే.. ఇక్కడే ఉంది అసలు మతలబు. తామిచ్చే బ్లాక్‌ను వీరు వైట్ చేయాల్సి ఉంటుందని సదరు వ్యాపారులు కండిషన్లు పెడుతున్నారట. ముఖ్యంగా అటు తెలంగాణలో ప్రస్తుతం ఈ జోరు ఎక్కువగా ఉందని తెలుస్తోంది.
మెజారిటీ ఫైనాన్సర్లు.. పార్టీలకు అతీతంగా నాయకులకు ఆఫర్లు ఇస్తున్నారని జోరుగా అంతర్గత చర్చ సాగుతోంది. నిజానికి ఎన్నికలకు ముందు ఆస్తులు అమ్ముకోవడం .. నామినేషన్లు వేసి.. ఖర్చు చేయడం వంటివి ఉండేవి.
అయితే.. ఇటీవల కాలంలో దాదాపు వ్యాపార వేత్తలు పెట్టుబడి దారులే రాజకీయాల్లోకి వస్తున్న నేపథ్యంలో వారికి ప్రత్యేకంగా ఎన్నికల సమయంలో పెట్టుబడులకు ఇబ్బంది లేదు. కానీ, వరసగా 10 ఏళ్లపాటు ప్రతిపక్షంలో ఉండడం.. వ్యాపారాలపై రాజకీయ దాడులు జరగడంతో కొందరు నాయకులు పైకి అంతా బాగుందని అంటున్నా.. అంతర్గతంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరిలోతెలంగాణ, ఏపీ నేతలు ఇద్దరూ ఉన్నారు.
దీంతో ఇలాంటివారే టార్గెట్‌గా థూల్ పేట నుంచి నాయుడు పేట వరకు.. ఫైనాన్సర్లు.. తమ ఏంజెట్లను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. కీలకమైన నాయకుల హామీ ఇంటే.. కోట్లకు కోట్ల రూపాయలను కుమ్మరించేందుకు కూడా వెనుకాడడం లేదని తెలుస్తోంది. ''ఇతర వాటిలో పెట్టుబడులు పెడితే.. పోలీసుల నుంచి భయం ఉంటుంది.
అదే రాజకీయాల్లో పెడితే.. ఇబ్బందులు ఉండవు. అందుకే ఈ మార్గం ఎంచుకున్నాం'' అని ఫైనాన్సర్లు అంతర్గత సంభాషణల్లో వ్యాఖ్యానిస్తున్నట్టు సమాచారం. ఇదీ.. సంగతి!