హైదరాబాద్‌లో యాపిల్ తొలి స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం!
హైదరాబాద్‌లో యాపిల్ తొలి అధికారిక రిటైల్ స్టోర్ డిసెంబర్ 10న కూకట్‌పల్లిలోని లేక్‌షోర్ – వై జంక్షన్ మాల్‌లో ప్రారంభం కానుంది. ‘యాపిల్ కూకట్‌పల్లి’ పేరుతో సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్స్ కొనుగోలుతో పాటు ఉచిత వర్క్‌షాప్‌లు, సాంకేతిక సహాయం కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
By: Tupaki Desk | 27 Nov 2026 7:54 AM ISTహైదరాబాద్‌లో యాపిల్ అభిమానులకు ఒక కొత్త అడ్రస్ అందుబాటులోకి రాబోతోంది. నగరంలో తన తొలి అధికారిక రిటైల్ స్టోర్‌ను ప్రారంభించేందుకు యాపిల్ సిద్ధమైంది. కూకట్‌పల్లిలోని లేక్‌షోర్ – వై జంక్షన్ మాల్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను డిసెంబర్ 10న సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనుంది. దీనికి 'యాపిల్ కూకట్‌పల్లి' అని పేరు పెట్టింది.
ఇప్పటివరకు హైదరాబాద్‌లో యాపిల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలంటే అధీకృత రిటైల్ దుకాణాలపై ఆధారపడాల్సి వచ్చేది. ఇప్పుడు కంపెనీ నిర్వహించే స్టోర్ అందుబాటులోకి రావడంతో వినియోగదారులకు మరో అవకాశం లభించనుంది. ఐఫోన్లు, ఐప్యాడ్‌లు, మ్యాక్‌బుక్స్‌తో పాటు యాపిల్ ఇతర ఉత్పత్తులను ఇక్కడ నేరుగా కొనుగోలు చేయవచ్చు.
ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాకుండా, వాటి పనితీరును తెలుసుకోవడానికి నిపుణుల సాయం కూడా అందుతుంది. ఫొటోగ్రఫీ, వీడియో, డ్రాయింగ్ వంటి అంశాలపై ఉచిత వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నారు. పరికరాలకు సంబంధించిన సందేహాలు, సాంకేతిక సమస్యలపై కూడా అధికారిక సహాయం పొందవచ్చు.
హైదరాబాద్‌కు యాపిల్ స్టోర్ రావడం మరో విశేషం. ఈ నగరంలో ఇప్పటికే కంపెనీ పరిశోధన, అభివృద్ధి విభాగంతో పాటు రిటైల్ కస్టమర్ కేర్ కార్యకలాపాలు కూడా ఉన్నాయి. తాజా స్టోర్‌తో భారత్‌లో యాపిల్ అధికారిక రిటైల్ దుకాణాల సంఖ్య ఏడుకు చేరనుంది.
